close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

130 కి.మీ. వేగం... సాధ్యమేనా.?

రేణిగుంటకు చేరుకున్న రైలు వద్ద అధికారులు

రైల్వేస్టేషన్‌(రేణిగుంట), న్యూస్‌టుడే: గంటకు 130 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించేందుకు అధికారులు పరీక్షించారు. సోమవారం ఉదయం 7 గంటలకు గుత్తి నుంచి 24 బోగీలతో బయలుదేరిన ఈ రైలు 10 గంటలకు రేణిగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా రైల్వే ట్రాక్‌ను ఆధునికీకరించి రైలు వేగాన్ని 110 నుంచి 130కి.మీ వేగానికి పెంచినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ రైలు రేణిగుంట నుంచి గుత్తి బయలుదేరి వెళ్లింది. కార్యక్రమంలో అధికారులు బ్రహ్మానందరెడ్డి, తులసీరామ్‌, కౌశల్‌పాండే, విల్సన్‌బాబు, కృష్ణ, రతన్‌రాజ్‌, శేషగిరినాథరెడ్డి, జయంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.