close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

800 చెరువులకు జలకళ

లీకేజీలకు సత్వర మరమ్మతులు

చిత్తూరు(వ్యవసాయం): జిల్లాలో విస్తారంగా కురుస్తోన్న వర్షాలకు పలు మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు ప్రవహిస్తుండగా.. చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. జిల్లాలో 8092 చెరువులు ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 800 చెరువులు(50 ఎకరాల లోపు విస్తీర్ణం) పూర్తిస్థాయి నీటి నిల్వతో జలకళ సంతరించుకున్నాయని జలవనరుల శాఖ ఎస్‌ఈ సురేంద్రరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాలో సుమారు 4,200 చెక్‌డ్యామ్‌లు ఉండగా ఇప్పటి వరకు 1200 చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయని చెప్పారు. 120 చెరువుల వద్ద కట్టలు, తూముల లీకేజీలు తలెత్తడంతో సత్వరమే ఆ ప్రాంత రైతుల భాగస్వామ్యంతో ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారన్నారు.పెద్ద చెరువులు, ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోందన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రమాదకర చెరువులను ముందస్తుగానే గుర్తించి పంట నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించామని పేర్కొన్నారు.

59 మండలాల్లో వర్షం

చిత్తూరు(వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి జిల్లాలోని 59 మండలాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షాలకు పలు మండలాల్లో వాగులు, వంకలు ప్రవహించి చెరువుల్లోకి నీరు చేరుతోంది. అత్యధికంగా పాకాల మండలంలో 84.2 మి.మీటర్లు, చంద్రగిరి 73.6, రామచంద్రాపురం 65.4, వరదయ్యపాళ్యం 64.8, తిరుపతి గ్రామీణ 62.8, బి.కొత్తకోట 61.0, సదుం, పలమనేరు 60.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.