close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబాబు సవాల్‌కు భయపడిన వైకాపా: నాని


మాట్లాడుతున్న పులివర్తి నాని

తిరుపతి(నగరం): రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని మార్చడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని మార్పు జరగలేదని, రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులు తెరపైకి వచ్చాయని విమర్శించారు. సీఎం జగన్‌ రాజధాని విషయంలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు వైకాపా భయపడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు మూడు రాజధానులు అన్నమాట వైకాపా ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజధానిని తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ధైర్యం ఉంటే మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని, ప్రజలు వైకాపాకు మళ్లీ అధికారం ఇస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని రాజసింహులు స్పష్టం చేశారు.మాజీ ఉప మేయర్‌ సుబ్రమణ్యం, నగర పార్టీ కన్వీనర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు. సత్యవేడు: నాడు అమరావతిని వ్యతిరేకించని జగన్‌ నేడు రాజధానిని మూడు ముక్కలు చేయడం ఎవరికోసమని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జడ్డా రాజశేఖర్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో ముందుకు రాకుంటే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు. నగరి: ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా మాట చెప్పి నేడు మడమ తిప్పడం ప్రజలను మోసం చేయడమేనని నియోజకవర్గ తెదపా బాధ్యుడు గాలి భానుప్రకాష్‌ ఆరోపించారు. పవిత్ర తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం ఎమ్మెల్యే రోజాకు అలవాటుగా మారిందని విమర్శించారు. శ్రీకాళహస్తి: మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న వైకాపాకు త్వరలోనే భంగపాటు తప్పదని తెదేపా శ్రీకాళహస్తి నియోజకవర్గ బాధ్యులు సుధీర్‌రెడ్డి అన్నారు. తాజా పరిస్థితులపై మంగళవారం హైదరాబాదు నుంచి విలేకరులతో మాట్లాడారు. పుత్తూరు: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పుత్తూరు సీపీఐ పట్టణ కార్యదర్శి మహేష్‌ ఆధ్వర్యంలో పుత్తూరులోని కార్వేటినగరం రోడ్డు కూడలిలో నిరసన తెలియజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.