close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగని కరోనా విలయం

మార్చురీ గదిని శుభ్రం చేస్తున్న ప్రిన్సిపల్‌ కృష్ణారావు

శాంతిపురం, న్యూస్‌టుడే: కరోనా విషయంలో ఎవరూ భయపడవద్దని పీఈఎస్‌ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హెచ్‌.ఆర్‌.కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీలో ఉంచి.. ఆపై వారి బంధువులకు అప్పగించారు. ఆ తరవాత ఆ మార్చురీ గదిని ఆయనే స్వయంగా శుభ్రపరిచారు. ఆస్పత్రిలోని కొవిడ్‌ విభాగంలో ఉన్న బాధితులతో మాట్లాడారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో వైద్యం పొందితే కరోనాను జయించవచ్చని తెలిపారు. చిత్తూరు గ్రామీణ: బీఎన్‌ఆర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని 190.రామాపురంలో ఒకటి, మంగసముద్రం హౌసింగ్‌ కాలనీలో ఐదు, లక్ష్మాంబాపురం ఎస్సీ కాలనీలో రెండు పాజిటివ్‌లు వచ్చాయని వైద్యాధికారి వినాయక్‌ తెలిపారు. గుడిపాల: కరోనా కట్టడికి మండలంలోని రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రంలో మంగళవారం 126 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని సచివాలయ సర్వేయర్‌ సంపత్‌ తెలిపారు. వీఆర్వో మల్లికార్జున, ఆరోగ్యకార్యకర్త సరస్వతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుప్పం పట్టణం: స్థానిక పాతపేట బీసీ కాలనీలో ఓ వ్యక్తికి, చిన్నకుర్లపల్లెలో ఓ చిన్నారికి పాజిటివ్‌ వచ్చిందని కమిషనర్‌ చిట్టిబాబు తెలిపారు. అక్కడ పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించామని చెప్పారు. రామకుప్పం: స్థానిక పీహెచ్‌సీలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌కు పాజిటివ్‌ వచ్చిందని వైద్యురాలు స్పందన తెలిపారు.ఆమెను కుప్పం కొవిడ్‌ ఆస్పత్రికి తరలించామని, పంచాయతీ సిబ్బంది ప్రభుత్వాస్పత్రిని శానిటైజ్‌ చేశారు. గంగవరం: పత్తికొండ పీహెచ్‌సీలో డాక్టర్లు శ్రీనివాసులు, యుగంధర్‌ ఆధ్వర్యంలో ఏడుగురు గర్భిణులకు యాంటీజెన్‌ కరోనా పరీక్షలు నిర్వహించారు. కాన్పుకు వారం రోజుల ముందు గర్భిణులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం వీరికి నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. గంగవరం: స్థానిక పీహెచ్‌సీని.. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లోకవర్ధన్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాతాశిశు సంరక్షణ సేవలు, సీజనల్‌ వ్యాధులపైనా దృష్టి సారించాలని సిబ్బందికి సూచించి, రికార్డులను పరిశీలించారు. పలమనేరు: బస్టాండుకు వెళ్లే దారిలో గుడియాత్తం సర్కిల్‌ దగ్గర సీఐ జయరామయ్య, ఎస్‌ఐ నాగరాజు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేకుండా వస్తున్నవారిని నిలువరించి జరిమానా విధించారు. బంగారుపాళ్యం: కరోనాతో చికిత్స పొందుతూ వ్యక్తి(80) మృతి చెందినట్లు తహసీల్దారు సీతారామ్‌, తుంబకుప్పం వైద్యాధికారి లోహిత్‌చెంగల్రాయన్‌ మంగళవారం తెలిపారు. యాదమరి: చిన్నంపల్లిలో ఓ యువకుడు(16)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సంతగేటు వైద్యాధికారి జ్యోతి తెలిపారు. కార్వేటినగరం: కార్వేటినగరంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈగా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. గంగాధరనెల్లూరు: కరోనా పాజిటివ్‌ వచ్చిన ఎస్‌ఎస్‌ కొండ బస్టాపులో దుకాణాదారునితో సన్నిహితంగా, బంధుమిత్రులైన 19మందికి మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలకు నమూనాలు సేకరించినట్లు వైద్యాధికారిణి దివ్య, ఆరోగ్య విద్యాధికారి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పెనుమూరు: మండలంలో మొత్తం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండల కేంద్రమైన పెనుమూరులో ఏడు, సామిరెడ్డిపల్లె పంచాయతీ బట్టువారిపల్లె దళితవాడలో రెండు, సాతంబాకం పంచాయతీ బలిజపల్లెలో ఒకటి, ఉగ్రాణంపల్లెలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.