close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి


గుడిపాల: చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న తెదేపా నాయకులు

గుడిపాల: అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ మంగళవారం తెదేపా మండల నాయకులు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వైకాపా నాయకులు ఎన్నికల ముందు రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి గెలిచిన తరవాత ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రాజధాని కోసం ఎందరో పేద రైతులు తమ భూములిచ్చారని, ఇప్పుడు మూడు రాజధానులంటూ వైకాపా ప్రభుత్వం చెప్పడంతో దీక్షలు చేస్తూ 77 మంది మరణించినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కమలేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌, నాయకులు రాజా, జయదేవనాయుడు, హేమాద్రినాయుడు, మురారి సుధాకర్‌, ఆరుముగం, మాజీ సర్పంచులు రవినాయుడు, జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. గంగాధరనెల్లూరు: స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులను చూసి అయినా రాజకీయం చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు నియోజకవర్గ తెదేపా బాధ్యులు హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు దేవసుందరం సూచించారు. సీఆర్‌డీఏ రద్ధు, మూడు రాజధానుల అంశంపై హైకోర్టు మంగళవారం స్టే విధించడం చూసి అయినా రాష్ట్రప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.