close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

మరో రెండు

జిల్లాకు నూతన మార్కెట్‌ కమిటీలు

అభ్యంతరాలపై నోటిఫికేషన్‌ జారీ

రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనకు ముందడుగు పడింది. ఇందులో భాగంగా జిల్లాలో మరో రెండు కొత్త వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే 20 మార్కెట్‌ కమిటీలు ఉండగా నూతనంగా రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఏఎంసీలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడు రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.

* రాజానగరం మార్కెట్‌ కమిటీ పరిధిలోకి రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలు రానుండగా.. రంపచోడవరం మార్కెట్‌ కమిటీ పరిధిలోకి మారేడుమిల్లి, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం మండలాలు ఉంటాయి.

14 మండలాలు ఈ రెండు మార్కెట్‌ కమిటీ పరిధిలోని రానున్నాయి. ఒకే నియోజకవర్గంలో రెండు మార్కెట్‌ కమిటీలు ఉన్నా వాటిని తొలగించకుండా అలాగే ఉంచుతారు. ఏఎంసీలు లేని నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.