close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

నిస్వార్థ సేవలతో గుర్తింపు
శిక్షణ ఐఏఎస్‌లకు సూచనలిస్తున్న కలెక్టర్‌ ముళీధర్‌రెడ్డి, చిత్రంలో జేసీ లక్ష్మీశ

కాకినాడ కలెక్టరేట్‌: నిస్వార్థ సేవలవల్లే ప్రజల్లో గుర్తింపు వస్తుందని, విధులు సక్రమంగా నిర్వహిస్తే పేదలకు న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడి,్డ శిక్షణ ఐఏఎస్‌లకు సూచించారు. జిల్లాలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి వచ్చిన శిక్షణ ఐఏఎస్‌లు కలెక్టరేట్‌లో కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం శిక్షణ ఐఏఎస్‌ల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ త్రివిక్రమ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.