close

గురువారం, ఫిబ్రవరి 27, 2020

ప్రధానాంశాలు

ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు

అరట్లకట్ట(కరప), న్యూస్‌టుడే: పంచాయతీ పాలనలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండలంలోని అరట్లకట్టలో ఆదివారం ఆయన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెడితే కిందిస్థాయికి చేరుతుందా లేదా అనే మీమాంస జన్మభూమి కమిటీల వల్ల ఉండేదన్నారు. ప్రతి పథకాన్ని లబ్ధిదారుని ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో రైతు భరోసా, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104 వాహనాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రజల సంక్షేమార్థం ఈ ఏప్రిల్‌ నుంచి కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం గతంలో వెయ్యి వ్యాధులకు వర్తించేదని, ప్రస్తుతం రెండువేల వ్యాధులకు పెంచడంతో పాటు బాధితుడికి ప్రతిరోజూ రూ.225 ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. గృహ నిర్మాణం పథకానికి సంబంధించిన పాత బిల్లులను త్వరలో మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.