close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గం
బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కాకినాడలోని ఆ సంఘం భవనంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు ప్రకటించారు. 11వ తేదీన సంఘం జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడే కార్యవర్గాన్ని నియమించుకునే అధికారాన్ని సంఘం బైలాలో ఉంది. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా జె.వెంకటేశ్వరరావు (రెవెన్యూ), సహ అధ్యక్షుడిగా రాయుడు సత్యనారాయణ (సెట్రజ్‌), ఉపాధ్యక్షులుగా తుమ్మలపల్లి నాగేశ్వరరావు (జీజీహెచ్‌), టి.వెంకటపతిరాజు (వైద్య, ఆరోగ్యశాఖ), టీవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు (ర.భ.), వై.శ్రీనివాస్‌ (అగ్నిమాపక), కె.సాంబశివరావు (రెవెన్యూ), ప్రధాన కార్యదర్శిగా సూరిశెట్టి గణపతి (అగ్నిమాపక శాఖ), కోశాధికారిగా పూడి.జాకబ్‌రాజు (పురపాలక శాఖ), కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్‌ (పశుసంవర్థక శాఖ), కార్యదర్శులుగా జి.జేమ్స్‌ (ఎస్సీ కార్పొరేషన్‌), జి.చిన్నారావు (వైద్య, ఆరోగ్య శాఖ), బుద్ద శ్రీనివాసరావు (పురపాలక శాఖ), బలగం బాలాజీవర్మ (పోర్టు), పీఎస్‌ఎన్‌ రాజు (అగ్నిమాపక శాఖ), సహాయ కార్యదర్శిగా కాకి రాము (ట్రెజరీ), కార్వనిర్వాహక కార్యదర్శులుగా కిలాడి డేవిడ్‌రాజు (పురపాలక), చెల్లంగి సత్యం (జలవనరులు), ప్రచార కార్యదర్శిగా ఎస్‌.నాగకనకరాజు (సర్వే) ముఖ్య సలహాదారులుగా వీవీజీ సత్యనారాయణ (అగ్నిమాపకశాఖ), కె.సాల్మన్‌రాజు (జైళ్లశాఖ), మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను నియమించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.