close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనోహర చిత్రాలు.. మదినిదోచే భావాలు

కోనసీమ చిత్రకళాపరిషత్‌ 30వ అంతర్జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన

తరలివచ్చిన ప్రముఖ చిత్రకారులు

పర్యావరణ రక్షణే ప్రథమ లక్ష్యంగా..

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: హృదయాన్ని స్పందింపజేసేదే నిజమైన కళ. చిత్రకారుడు తన కుంచెతో అద్భుతాలు సృష్టిస్తాడు. జీవం ఉట్టి పడే కళాఖండాలకు అమలాపురం వేదికైంది. పట్టణంలోని సత్యసాయి కల్యాణమండపంలో కోనసీమ చిత్రకళారిషత్తు 30వ అంతర్జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన ఆదివారం జరిగింది. పరిషత్తు వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు కొరసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ పోటీల్లో బంగ్లాదేశ్‌, దిల్లీ, పంజాబ్‌, గుల్బర్గా, చెన్నై, తెలంగాణ తదితర ప్రాంతాల చిత్రకారులు పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారులతో పాటు బాలలు గీచిన చిత్రాలు చూపరులను కట్టిపడేసాయి. పెద్దలు, మహిళలతో పాటు చిన్నారులు ప్రదర్శనలోని చిత్రాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కోనసీమ చిత్రకళాపరిషత్‌ అధ్యక్షుడు రమణబాబు అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కొండా శ్రీనివాసరావు గీసిన ప్రభలతీర్థం చిత్రం మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి చిత్రకళారత్న అవార్డుతో పాటు రూ.25 వేలు నగదు అందజేసి శాలువాతో సత్కరించారు. మరో తొమ్మిది మందికి సుబ్బయ్య (గుల్‌బర్గా), ఆగాచార్య (హైదరబాద్‌), దేవేంద్ర బడిగర్‌ (ధార్వాడ), వజ్రగిరి జస్టిస్‌ (వినుకొండ), కె.సుబ్రహ్మణ్యం (విజయవాడ), ఎస్‌.శ్రీనివాసరెడ్డి (చినగంజాం), ఉమేష్‌ (కర్ణాటక), నాగరాజ్‌ (గుల్‌బర్గా), పవన్‌ (కాకినాడ)లకు చిత్రకళారత్న అవార్డులతో పాటు రూ.10 వేలు నగదు బహుమతిని అందజేసి సన్మానించారు. ప్రముఖ చిత్రకారులు బత్తుల బాపూజీ, చింతా శ్యామ్‌, ఉదయ్‌కుమార్‌, టి.నగేష్‌, సి.కోటేశ్వరరావులకు జీవనసాఫల్య పురస్కారాలు అందజేశారు. బాలలు గీసిన పలు చిత్రాలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో గోదశి గంగరాజు, మోటూరి భైరవస్వామి, డాక్టర్‌ బసవా వరహాలు పాల్గొన్నారు.

ప్రథమ బహుమతి గెలుచుకున్న కొండా శ్రీనివాసరావుని సన్మానిస్తున్న చిత్రం

అచ్చరవొందేలా గజరాజు

పండు వెన్నెల్లో యువతి

 

 

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.