close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

గవర్నర్‌ పర్యటనకు ఏరా్పట్లు పూర్తి

గైట్‌లో హెలీప్యాడ్‌ను పరిశీలించిన సబ్‌కలెక్టర్‌


గైట్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, తదితరులు

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రానున్న సందర్భంగా ఏర్పాట్లను రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. గవర్నర్‌ హెలీకాప్టర్‌ దిగేందుకు గైట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను మహేష్‌కుమార్‌ పరిశీలించారు. గవర్నర్‌ బస కోసం సిద్ధం చేసిన ఛాంబర్‌, మధ్యాహ్నం భోజనం చేసే అతిథిగృహాన్ని పరిశీలించారు. గవర్నర్‌ పర్యటనకు సంబంధించి కళాశాలలో చేస్తున్న ఏర్పాట్లను చైతన్య సంస్థల జనరల్‌ మేనేజర్‌ ఎ.నరేష్‌రాజు, గైట్‌ జనరల్‌ మేనేజర్‌ పి.సుబ్బరాజులు సబ్‌కలెక్టర్‌కు వివరించారు. హెలీప్యాడ్‌ ఏర్పాట్ల పరిశీలనలో నన్నయ వీసీ ఎం.జగన్నాథరావు, రిజిస్ట్రార్‌ ఎస్‌.టేకి, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ లతామాధురి, తదితరులు పాల్గొన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం నుంచి గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోకి గవర్నర్‌ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ గురువారం సాయంత్రం నిర్వహించారు.

పర్యటన సాగేదిలా..

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన వివరాలను రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ విలేకరులకు వివరించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గైట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు గవర్నర్‌ చేరుకుంటారు. 10.15 నుంచి 10.35 గంటల వరకు గైట్‌ గెస్ట్‌ హౌస్‌లో సేదదీరుతారు. 10.35 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 10.55 మధ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 12.50 గంటలకు బయలుదేరి 12.55 గంటలకు గైట్‌ కళాశాలకు చేరుకుంటారు. 12.55 నుంచి 1.10 గంటల వరకు గైట్‌ కళాశాల గెస్ట్‌ హౌస్‌లో ఉంటారు. 1.15 గంటలకు బయలుదేరి గన్నవరం వెళ్తారు.

నన్నయ విశ్వవిద్యాలయం నుంచి గైట్‌ కళాశాల ప్రాంగణంలోకి వెళ్తున్న గవర్నర్‌ కాన్వాయ్‌ (ట్రయల్‌ రన్‌)

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.