close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

రైతు భరోసా కేంద్రాలకు హంగులు  

● జిల్లాలో తొలి దశలో 310 ప్రారంభం

కొత్త రంగులకు రూ.66 లక్షలు


పి.గన్నవరంలో రైతుభరోసా కేంద్రం ఏర్పాటు చేసే పీఏసీఎస్‌ భవనం

 

పి.గన్నవరం, న్యూస్‌టుడే: రైతులకు అన్ని దశల్లోనూ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తోంది. తొలిదశలో ప్రతి మండలానికి కనీసం అయిదు కేంద్రాలుండాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి వాటికి భవనాలు లేకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయ భవనాలు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, అవీ లేకపోతే అద్దెకు ప్రైవేటు భవనాలు తీసుకుని వాటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో తొలివిడతగా ఫిబ్రవరి ఒకటి నుంచి 310 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో సుమారు 170 సహకార సంఘాలకు సంబంధించిన భవనాలు ఉన్నాయి. మిగిలినవి ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు. 310 రైతు భరోసా కేంద్రాలతోపాటు రావులపాలెం, రాజమహేంద్రవరం, తుని, నడకుదురు, ద్రాక్షారామలలో వ్యవసాయ హబ్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ భవనాలకు ప్రభుత్వం నిర్దేశించిన రంగులు వేయాలని ఆదేశాలొచ్చాయి. ఒక్కో భవనానికి రంగులు వేసేందుకు రూ.21వేల వంతున కేటాయించారు. ఆ భవనాలను వ్యవసాయశాఖ ఎంపిక చేసింది. అందులో రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ హబ్‌లు కలిపి 315 భవనాలకు రంగులు వేసేందుకు రూ.66.15లక్షలు ఖర్చుచేస్తారు. ఇప్పటికే రంగులు వేసే పనులు మొదలయ్యాయని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.ఎస్‌.వి.ప్రసాద్‌ తెలిపారు. ఆ బాధ్యతను పంచాయతీరాజ్‌శాఖ చూస్తుందన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి తొలిదశలో ఈ కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందుతాయని చెప్పారు. ఫిబ్రవరి ఒకటినాటికి మొదటి దశలో ఎంపిక చేసిన భవనాలకు రంగులు పూర్తిచేస్తారని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.