close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

సంకల్పానికి నిర్లక్ష్య పోటు

● జిల్లాలో సుకన్య సమృద్ధి యోజన అమలులో వెనకబాటు

● ఖాతాల ప్రారంభంలో కనిపించని పురోగతి

● లక్ష్యానికి దూరంగా తపాలా శాఖ

రాజమహేంద్రవరంలోని తపాలా కార్యాలయం

రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన జిల్లాలో లక్ష్యాలను చేరుకోలేకుంది. దీనిద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరే అవకాశమున్నా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో తపాలాశాఖ ముందడుగు వేయలేకపోతోంది. బాలికలపై వివక్షను తొలగించి బాలికా విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో..బేటీ పడావో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో నుంచి వచ్చిందే ‘సుకన్య సమృద్ది .యోజన’. అనేక మంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు..పెళ్లిళ్ల సమయంలో అయ్యే ఖర్చులతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 14 ఏళ్ల వరకు ఈ పథకం కింద పొదుపు చేసుకునే అవకాశం ..మిగతా 7లోకల్పించింది. ఏడాదికి రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు ఎంతైనా పొదుపు చేసుకోవచ్ఛు 14 ఏళ్లు పొదుపు చేసుకున్న మొత్తాన్ని బాలికకు 18 సంవత్సరాల తరువాత ఉన్నత చదువుల కోసం కొంత, 21 సంవత్సరాల తరువాత మిగిలిన మొత్తాన్ని వివాహానికి పొందవచ్ఛు ఈ పథకం కింద పొదుపు మొత్తానికి 8.5 శాతం వడ్డీని చెల్లిస్తారు. తపాలా కార్యలయాలు, దేశంలో గుర్తింపు పొందిన 14 బ్యాంకుల్లో ఖాతాను ప్రారంభించి పొదుపు చేసుకోవచ్ఛుప్రతి తపాలా కార్యాలయం పరిధిలో కొన్ని లక్ష్యాలను నిర్ధేశించారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇచ్చిన లక్ష్యాలను సిబ్బంది చేరుకోవాలి. కానీ జిల్లాలో మాత్రం తపాలా శాఖ ఈ విషయంలో బాగా వెనుకబాటులో ఉంది. కొన్ని చోట్ల ప్రజలు ఈ పథకం కింద ఖాతాలను ప్రారంభించేందుకు వెళ్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.జిల్లాలో అయిదేళ్లలో 2,13,000 ఖాతాలు తెరవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 83,381 ఖాతాలను మాత్రమే ప్రారంభించారు. ఏటా ఇదే తంతు కొనసాగుతోంది.

ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు

కేంద్రం పెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. ప్రజలు వచ్చినప్పుడు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకురావచ్ఛు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. -సీహెచ్‌.సూర్యనారాయణ, పర్యవేక్షకుడు, తపాలా శాఖ, రాజమహేంద్రవరం డివిజన్‌ 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.