close

బుధవారం, ఏప్రిల్ 01, 2020

ప్రధానాంశాలు

నిర్వాసితుల సమస్యలపై పోరాటం ఉద్ధృతం

● పోలవరం నిర్వాసితుల పరిరక్షణ సేవా సమితి

● మార్చి 5న చలో అమరావతి టూ న్యూదిల్లీ

గుండాల కాలనీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న పోలవరం నిర్వాసితుల

 పరిరక్షణ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు చందా లింగయ్యదొర

ఎటపాక, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఉద్ధృతం చేస్తామని, మార్చి 5న చలో అమరావతి టూ న్యూదిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పోలవరం నిర్వాసితుల పరిరక్షణ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు చందా లింగయ్యదొర అన్నారు. ఎటపాక మండలం గుండాలకాలనీలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. విలీన మండలాల్లో ప్రస్తుత పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. నాలుగు రాష్ట్రాల్లో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అందుకే నాలుగు రాష్ట్రాల నిర్వాసితులను సమ్మిళితం చేస్తున్నామన్నారు. సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు కనీసం మెరుగైన పరిహారం ఇవ్వడానికి ఎందుకు మందుకు రావడం లేదన్నారు. విలీన మండలాలపై పక్షపాతం చూపుతున్నారన్నారు. పునరావాసం, పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మార్చి 26న ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి సమస్యను వివరిస్తామన్నారు. చలో అమరావతి టూ న్యూదిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరాములు, పెరమయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.