close

మంగళవారం, మార్చి 31, 2020

ప్రధానాంశాలు

సూర్యారాధనలో పాల్గొన్న జస్టిస్‌ శివశంకరరావు  


సూర్యతీర్థాన్ని స్వీకరిస్తున్న జస్టిస్‌ శింశంకరరావు

 

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని ఇందుపల్లిలో జరుగుతున్న సూర్యారాధన మాసదీక్ష పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర జుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ బులుసు శివశంకరరావు శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు. సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సూర్యతీర్థాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఇలాంటి యాగాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ నెల 23న పంచమ మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమం పూర్ణాహుతితో ముగుస్తుందని యాగకర్త గొర్తి గోపాలకృష్ణ తెలియజేశారు. ఆదివారం అన్నసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.