close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

చదరంగస్థలం

వారు ఎత్తు వేస్తే ప్రత్యర్థులు చిత్తే

ప్రతిభ చాటుతున్న కుటుంబం

న్యూస్‌టుడే, మండపేట

చదరంగం పోటీల్లో తాము సాధించిన 
బహుమతులతో రవికుమార్‌ ఆయన కుటుంబ సభ్యులు 

ఒకే ఇంట్లో ఉన్నా వారి అభిరుచులు, భావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు క్రీడలపై ఆసక్తి తగ్గడంతో సెలవులు వచ్చాయంటే పిల్లలు, పెద్దలు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేయడం మనం చూస్తున్నాం. మండపేటకు చెందిన  రవికుమార్‌ తన భార్య, ముగ్గురు కుమార్తెలతో కుటుంబంలో అందరూ చదరంగం ఆడుతూ  కాలక్షేపం చేస్తారు. వీరు చదరంగాన్ని ఎంతో ఇష్టపడటమే కాదు, జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటుకుని రాణిస్తున్నారు.

 

పెయింటింగ్‌ వృత్తి చేసుకునే రవికుమార్‌కు పజిల్స్‌ పూర్తి చేయడం ఎంతో ఇష్టం. ‘ఈనాడు ఆదివారం’ మ్యాగ్‌జైన్‌ వచ్చిన వెంటనే పజిల్స్‌ అవలీలగా పూర్తి చేస్తారు. 1995లో ఒక రోజు అరుగు మీద కూర్చుని ఇద్దరు వ్యక్తులు చదరంగం ఆడటాన్ని ఆసక్తిగా గమనించారు. తనకు నేర్చుకోవాలనే కుతూహలం కలిగింది. నేర్పించేందుకు వారు నిరాకరించడంతో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. తన స్నేహితుడు ఆబిద్‌బాషాకు చెప్పడంతో చదరంగంపై ప్రవేశం ఉన్న ఆయన వెంటనే నేర్పించారు. ఖాళీ సమయాల్లో సాధన చేయడంతో పాటు చదరంగం పోటీల్లో పాల్గొని ఎక్కువ రౌండ్లు గెలిచి తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో బహుమతులు సాధించారు. అలా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఇతరులకు శిక్షణ ఇచ్చేవారు. 2001లో వరహాలుతో వివాహమైన తరువాత వివిధ ప్రాంతాల్లో నిర్వహించే చదరంగం పోటీలకు భార్యతో కలిసి వెళ్లడంతో ఆమె సైతం ఆసక్తితో నేర్చుకున్నారు. రవికుమార్‌ 2003లో షెహరాన్‌పూర్‌లో నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రతిభావంతుడిగా ప్రశంసలు అందుకున్నారు. భార్యభర్తలు ఇద్దరూ కలిసి విజయవాడ, హైదరాబాద్, దిల్లీ, ముంబైల్లో నిర్వహించే అంతర్జాతీయ రేటింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొని ఎన్నో బహుమతులు అందుకున్నారు.

ఇటీవల నెల్లూరులో సాధించిన ట్రోఫీతో వరహాలు 

వరహాలు సాధించిన విజయాలు

* వరహాలు 2013లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన స్క్వేల్స్‌ 64వ చదరంగం అకాడమీ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతి అందుకున్నారు. అదే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా ఫిడె రేటింగ్‌ చదరంగం పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించారు. డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన మాగ్జిమాస్‌ ఆల్‌ ఇండియా ఫిడె రేటింగ్‌ చదరంగం పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు.

* 2014లో పాలకొల్లులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు.

* 2015లో ముంబైలో నిర్వహించిన మహిళా విభాగం ఛాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొన్నారు. 2017లో మహారాష్ట్రలో నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానం, అదే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించిన టెరాసాఫ్ట్‌ అంతర్జాతీయ ఓపెన్‌ ఫిడె రేటింగ్‌ ఛాంపియన్‌ పోటీలో తృతీయ బహుమతి సాధించారు.

* 2018లో హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ నెల 9న నెల్లూరులో నిర్వహించిన ఆల్‌ ఇండియా మస్తానయ్యా చదరంగం పోటీల్లో మహిళా విభాగంలో పురస్కారం అందుకున్నారు.

 

చదవుతో పాటు చదరంగంలో..
రవికుమార్‌ కుమార్తెలు విశార్తి కాకినాడలో పాలిటెక్నిక్, జోష్మిక 10వ తరగతి, చైత్రిక 9వ తరగతి చదువుతున్నారు. వీరు సైతం చాలా సార్లు చదరంగం పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. ఎన్నో బహుమతులతోపాటు చదువులో ప్రథమ స్థానంలో రాణిస్తున్నారు.

 

గ్రాండ్‌మాస్టర్‌ను చేయాలని.. 

పెయింటింగ్‌ వృత్తితో పాటు ఖాళీ సమయాల్లో మా వారు మండపేట పరిసర గ్రామాల్లో చదరంగం నేర్పిస్తుంటారు. నేను వారానికి రెండు రోజులు కాకినాడలో చదరంగంలో శిక్షణ ఇస్తున్నా. చదరంగం క్రీడ వల్ల మానసిక ఒత్తిడులు ఉండవు.. ఆలోచనశక్తి పెరుగుతుంది. ఇలా మా పిల్లలు చిన్నతనం నుంచి చదువులో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మా పిల్లల్లో ఎవరినైనా గ్రాండ్‌ మాస్టర్‌గా చేయాలని కోరిక ఉంది. -బి.ఎల్‌.ఎన్‌.వరహాలు, చదరంగం క్రీడాకారిణి

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.