close

సోమవారం, ఏప్రిల్ 06, 2020

ప్రధానాంశాలు

ప్రయాణ ప్రాంగణం.. పర్యావరణ హితం

స్టేషన్లలో ప్రత్యేక ఆకర్షణగా సౌర వెలుగులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జిల్లాకు ప్రత్యేక స్థానం

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరం

భారతీయ రైల్వేలు తమ పరిధిలోని పలు స్టేషన్లలో సహజ వనరుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని 13 రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మకంగా పూర్తిగా విద్యుత్తు అవసరాలను సౌరశక్తితో భర్తీ చేసుకునేందుకు ముందుకు సాగుతోంది. తొలి దశలో ప్రకటించిన 13 రైల్వేస్టేషన్లలో మూడు మన జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఎనర్జీ న్యూట్రల్‌ రైల్వేస్టేషన్‌.. అనే ఆలోచనతో జిల్లాలోని గోదావరి, కడియం, ద్వారపూడి రైల్వేస్టేషన్లలో విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర ఫలకలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు నుంచి స్టేషనులోని అవసరాలను తీర్చడంతోపాటు, నీటిని తోడే మోటర్లకూ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పథకాలు ఆశాజనకంగా ఉండడంతో త్వరలో బిక్కవోలుతోపాటు మరిన్ని స్టేషన్లలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

అమలు ఎన్నడు..?

గతంలోనే రాజమహేంద్రవరం రైల్వేస్టేషను పరిసరాల్లో ఇప్పటికే నీటిని తోడేందుకు 3, 2 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లకు సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రైల్వేస్టేషన్‌ అవసరాలకు సుమారు 150 కిలోవాట్ల విద్యుత్తు కావాల్సిఉంటుందని అంచనాలు రూపొందించి ఇప్పటికే అనుమతులకు పంపారు. గతంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చినప్పుడు ‘న్యూస్‌టుడే’ ఇదే విషయం ప్రస్తావించినప్పుడు శాఖాపరమైన కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కార్యరూపు దాల్చితే ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని నాలుగు, అయిదు ప్లాట్‌ఫాంలపై ఏర్పాటు చేసిన పద్ధతిలోనే సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ఫలకలతో ప్లాట్‌ఫాం పైకప్పులు ఏర్పడతాయి. దాంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషను పర్యావరణహిత స్టేషనుగా మారుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.