close

బుధవారం, జూన్ 03, 2020

ప్రధానాంశాలు

జిల్లాలో 4వ పాజిటివ్‌ కేసు

పెద్దాపురంలో 65 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ

అతని కుటుంబికులతో సహా 53 మందికి వైద్య పరీక్షలు

దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన 26 మందిలో ముగ్గురికి పాజిటివ్‌

మిగిలిన 23 మందిలో ఏమీలేదని తేల్చిన యంత్రాంగం

పెద్దాపురంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తి ఉంటున్న ప్రాంతంలో సోడియం 
హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ

మతపరమైన ప్రార్థనలకు దిల్లీ వెళ్లి.. పెద్దాపురం పట్టణానికి వచ్చిన 65 ఏళ్ల వ్యక్తిలో కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో జిల్లాలో మరో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు  పేర్కొంది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 

ఈనాడు, కాకినాడ : జిల్లాలో పెద్దగా ఇబ్బందేమీ లేదనుకున్న తరుణంలో అనూహ్యంగా దిల్లీలోని నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారిలో వరుసగా వ΄డు పాజిటివ్‌ కేసులు ఉండడం యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దిల్లీ పర్యటనలో జిల్లా నుంచి 26 మంది పాల్గొన్న విషయం తెలిసిందే. వీరిలో 23 మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు లేవని అధికారులు ప్రకటించారు. వ΄డు పాజిటివ్‌ కేసులను ప్రత్యేక ఐసోలేషన్‌ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వీరి కుటుంబికులతో సహా వారు బయటకు వెళ్లి కలిసిన 149 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. పెద్దాపురంలో మంగళవారం వెలుగు చూసిన పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి స్వస్థలం రాజమహేంద్రవరం. ఆయన దిల్లీ పర్యటన అనంతరం గత నెల 18న సామర్లకోట స్టేషన్‌లో రైలు దిగి పెద్దాపురంలోని ఓ వీధిలో ఉంటున్న కుమార్తె నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ చుట్టుపక్కల వారిని కలవడంతో పాటు గత నెల 20, 27 తేదీల్లో పట్టణంలోని ఓ మసీదులో పార్థనలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ కుటుంబికులు ఆరుగురిని వైద్యశాలలకు తరలించారు. ఈయనతో ప్రార్థనల్లో పాల్గొన్న, మాట్లాడిన మొత్తం 53 మందికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ విభాగంలో అనుమానిత కేసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సమీప బొవ΄్మరులోని టిడ్కో గృహ సముదాయంతో పాటు కాకినాడలోని జేఎన్‌టీóŸ΄కే, అన్నవరంలోని దేవస్థానం సత్రం, అమలాపురంలోని ఏకాంత గదుల్లో పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణలో ఉంచారు

పెద్దాపురంలో హైఅలర్ట్‌..
పెద్దాపురంలో పాజిటివ్‌ కేసు ఉన్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ఆ నివాసానికి క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ ట్రీట్‌మెంట్‌ చేశారు. చుట్టుపక్కల రాకపోకలపై ఆంక్షలు విధించి బ్లీచింగ్‌ చల్లడంతోపాటు.. సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 80 మంది స్థానికులను పెద్దాపురంలోని బాలుర వసతిగృహంలో క్వారంటైన్‌లో పర్యవేక్షణలో ఉంచారు. 

ఆ ముగ్గురు.. మరో 149 మంది..
దిల్లీ పర్యటనకు వెళ్లి జిల్లాకు వచ్చిన వ΄డు పాజిటివ్‌ కేసులు ఎక్కడెక్కడికి తిరిగారు.. ఎవరెవరిని ప్రత్యక్షంగా కలిశారు.. అన్నదానిపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి స్పష్టతకు వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి 16 మంది కుటుంబికులతో పాటు బయటి వ్యక్తులు ఎనిమిది మందిని కలిసినట్లు గుర్తించారు. కాకినాడకు చెందిన వ్యక్తి అయిదుగురు కుటుంబ సభ్యులతోపాటు 61 మంది బయటి వ్యక్తులను కలిసినట్లు తేల్చారు. పెద్దాపురంలోని వ్యక్తి ఆరుగురు కుటుంబ సభ్యులసహా 53 మందిని ప్రత్యక్షంగా కలిసినట్లు గుర్తించారు. ఇప్పటికే కాకినాడ పాజిటివ్‌ కేసు కుటుంబికులందరికీ నెగిటివ్‌ ఫలితాలు రాగా.. మిగిలిన రెండు కేసులపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.