close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

మాయ మాటలతో వంచన..

అక్కాచెల్లెళ్లను ఇంటికి తీసుకెళ్లిన అన్న
యువతిపై తమ్ముడి అత్యాచారం
నిందితుల అరెస్టు

కేశవగిరి, న్యూస్‌టుడే: ఆటో ఎక్కిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను దర్గాకు తీసుకెళతానని మాయమాటలతో కిడ్నాప్‌ చేసి ఇంట్లో దాచిన ఆటోడ్రైవర్‌... ఇంట్లో దిగబెడతానని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ తమ్ముడు కటకటాల పాలయ్యారు. సంచలనం సృష్టించిన అపహరణ.. అత్యాచారం కేసు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. ఫలక్‌నుమా ఫాతిమానగర్‌కు చెందిన ఇద్దరు నిందితులు (సోదరులు) మహ్మద్‌ మూసా(21), మహ్మద్‌ ఆమెర్‌(24)లను చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అసలేం జరిగింది.. చాంద్రాయణగుట్ట చౌరస్తాకు సమీపంలోని హాషామాబాద్‌లో నివసించే ఓ బాలిక(18) ఆమె చెల్లెలు(10) (చిన్నాన్న కూతురు) ఈనెల 8న హాషామాబాద్‌ మెయిన్‌రోడ్డులో దర్గాకు వెళ్లేందుకు ఆటో కోసం నిల్చున్నారు. ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఆమెర్‌ వారిని ఎక్కించుకుని అటూఇటూ తిప్పి చీకటి పడడంతో దర్గాకు వెళ్లడం సురక్షితం కాదంటూ వట్టేపల్లి ఫాతిమానగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఉదయం దర్గాకు తీసుకెళ్తానని చెప్పి వారిని నమ్మించాడు. ఆటోడ్రైవర్‌ తమ్ముడు మహ్మద్‌ మూసా.. ఇంట్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడాడు. తమ ఇంటికి తీసుకెళ్లాలని అతడిని అభ్యర్థించారు. దీంతో వారిని ముసా బండిపై ఎక్కించుకొని నాంపల్లిలోని హోటల్‌కు తీసుకెళ్లాడు.

భార్యాభర్తలమని చెప్పి గది అద్దెకు తీసుకుని.. చీకటి పడిందని ఉదయం ఇంటికి వెళదామని మూసా.. మాయమాటలతో అమ్మాయిలను మభ్యపెట్టి హోటల్‌లో గది అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు. నకిలీ ధ్రువపత్రాలతో భార్యాభర్తలని నమ్మించి గది అద్దెకు తీసుకున్నాడు. గదిలోకి తీసుకెళ్లిన మూసా.. బాలిక(18)ని భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌ వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాలికలను గమనించిన రైల్వే పోలీసులు.. వారి నుంచి సమాచారం సేకరించి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు వారి అదృశ్యంపై ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి ఆచూకీ తెలియగా భరోసా కేంద్రానికి పంపి వివరాలు సేకరించి నాంపల్లిలోని లాడ్జి వద్ద సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.