close

గురువారం, ఫిబ్రవరి 27, 2020

ప్రధానాంశాలు

‘మైటీ లిటిల్‌ భీమ్‌’కు ప్రపంచ వ్యాప్త ఆదరణ

‘గ్రీన్‌గోల్డ్‌’ వ్యవస్థాపకుడు రాజీవ్‌ చిలక

గచ్చిబౌలి: నగరంలోని గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ రూపొందించిన ‘‘మైటీ లిటిల్‌ భీమ్‌’’ కార్టూన్‌ షో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని,  2019 సంవత్సరానికి గాను అత్యంత ఆదరణ పొందిన కార్టూన్‌ షోగా గుర్తింపు సాధించిందని ఆ కంపెనీ వ్యవస్థాపకులు రాజీవ్‌ చిలక పేర్కొన్నారు. అమెరికా, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఆఫ్రికా ఇలా దాదాపు 190 దేశాల్లో 2.70 కోట్ల ఇళ్లల్లో ఈ షోను తిలకిస్తున్నారన్నారు. ప్రీ స్కూల్‌ ప్రేక్షకుల విభాగంలో ఈ షో నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కంపెనీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజీవ్‌ మాట్లాడారు. ఈ కార్టూన్‌ పాత్రను అన్ని దేశాల్లో చిన్నారులు అమితంగా ఇష్టపడుతున్నారన్నారు. డైలాగులు లేకుండా, కేవలం 15 నెలల వయసుండే మైటీ లిటిల్‌ భీమ్‌ చూడముచ్చటైన చేష్టలతో ఈ షో సాగుతుందని తెలిపారు. విదేశీయులకు మన సంస్కృతి సంప్రదాయాలను ఈ షో పరిచయం చేస్తోందన్నారు. 200 మంది ఉద్యోగులు దాదాపు 18 నెలల పాటు శ్రమంచి దీన్ని రూపొందించారని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్‌ చిలకలపూడి, భరత్‌లక్ష్మిపతి, సురేష్‌, అపూర్వ, కైజర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.