close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

ఓటరు అవగాహన సదస్సు నేడు

హాజరుకానున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి

బాచుపల్లి(నిజాంపేట), న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సును శనివారం నిర్వహించనున్నట్లు వేదిక మేడ్చల్‌ జిల్లా కన్వీనర్‌ మధుబాబు తెలిపారు. బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు

మరిన్ని వార్తలు

నిర్బంధ ‘శిక్ష’ణ.. ప్రాణాలకేదీ రక్షణ?

సోమవారం వచ్చిందంటే రెండు లేదా మూడు పరీక్షలు రాయాల్సిందే..! ఇక దానికి ముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీఅవర్‌ పేరిట రుద్దుడు.. అలా అని వారంలో మిగిలిన రోజులు స్వేచ్ఛగా ఉంటుందా.. అంటే అసలే ఉండదు. రెగ్యులర్‌ సబ్జెక్టులు చదవాలి.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.. నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పంజరంలా భావిస్తున్న కళాశాలల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా.. అని భావిస్తున్నారు. ఏదో రకంగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  చేరితే చదువు తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా కనీసం బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండటం లేదు. కళాశాలలో చేరినప్పట్నుంచి ఇంటర్‌ విద్యార్థులపై చదవుల భారం వేస్తుండటంతో.. వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.