close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

మెట్రోకు అనుమతి.. పనులకేదీ అతీగతి?

 నెలాఖరున ప్రారంభం.. అప్పటిలోగా పూర్తయ్యేనా?
 జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో అసంపూర్తి పనులు
 కొన్నిచోట్ల మొదలెట్టలే.. పాదబాటలు లేక తిప్పలు
ఈనాడు, హైదరాబాద్‌

రెండు ప్రధాన బస్‌ స్టేషన్ల అనుసంధానానికి నిర్మించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభానికి తుది అనుమతులు లభించినా.. స్టేషన్ల మెట్ల మార్గాలు, రహదారిపై సుందరీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పురపాలక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన వెంటనే ఈ నెలాఖరులోపు మెట్రో ప్రారంభించే అవకాశం ఉండటంతో అప్పటివరకు పనులు పూర్తవుతాయనే ధీమాలో మెట్రో వర్గాలున్నాయి. ఈ మార్గంలోని 9 స్టేషన్ల పరిసరాలను ‘ఈనాడు’ పరిశీలించగా 8 స్టేషన్లలో పాదచారుల బాటల పనులు వేర్వేరు దశలో ఉన్నాయి.

మొత్తం 10 కి.మీ.
మెట్రోరైలు కారిడార్‌-2.. జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కి.మీ. ప్రతిపాదించగా పాతబస్తీలో అలైన్‌మెంట్‌ వివాదాలతో అక్కడ పనులు చేపట్టలేదు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 10 కి.మీ. మాత్రమే పూర్తిచేశారు. జేబీఎస్‌ స్టేషన్‌ దాటాక అరకిలోమీటరు, ఎంజీబీఎస్‌ స్టేషన్‌ దాకాక అరకిలోమీటరు దూరం మెట్రో మళ్లేందుకు వీలుగా రివర్సల్‌ ట్రాక్‌లు నిర్మించారు. దీనితో కలిపి 11 కి.మీ.గా అధికారులు చెబుతున్నా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది పది కిలోమీటర్లే.

జేబీఎస్‌ ప్రయాణికులకు తిప్పలే
మొదట్లో జూబ్లీబస్‌ స్టేషన్‌ ప్రధాన ద్వారం ఎదుట జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ను ప్రతిపాదించారు. సమీపంలోనే పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌ వస్తుండటంతో జేబీఎస్‌ స్టేషన్‌ను తొలగించారు. పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్నే జేబీఎస్‌-పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌గా మార్పు చేశారు. అయితే ఇక్కడ దిగిన ప్రయాణికులు దాదాపు 200 మీటర్ల దూరం నడుచుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్థలం మీదుగా జేబీఎస్‌ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

పాతబస్తీలో పనులెప్పుడో..
ఎంజీబీఎస్‌ తర్వాత పాతబస్తీలో 5 కి.మీ. మార్గంలో సలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషేర్‌గంజ్‌, ఫలక్‌నుమా.. ఇలా 5 మెట్రోస్టేషన్లు రావాల్సి ఉండగా అలైన్‌మెంట్‌ వివాదంతో పనులు మొదలు పెట్టలేదు. ప్రాజెక్ట్‌ వ్యయం పెరగడం, అలైన్‌మెంట్‌పై స్పష్టత ఆలస్యమవడంతో ఈ పనుల నుంచి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో వైదొలగడంతో మొదటిదశ నుంచి ప్రభుత్వం పాతబస్తీని తప్పించింది. కొత్త, పాత నగరాలను, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలను కలిపి డిజైన్‌ చేసిన మెట్రో పాతబస్తీకి వెళ్లకుండానే ఆగిపోయింది.

కొన్ని స్టేషన్లలో మూడు మార్గాలే..
మెట్రో మార్గంలోని ప్రతిస్టేషన్‌లో నాలుగువైపులా ‘ఎ, బి, సి, డి’ పేరుతో మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల సదుపాయం కల్పించాలి. అయితే సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, ముషీరాబాద్‌.. ఈ 5 స్టేషన్లలో మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు మూడువైపులే ఉన్నాయి. ఆస్తుల సేకరణ సమస్యతో ‘డి’ మార్గం వైపు మెట్లు నిర్మించలేదు. కొన్నిస్టేషన్లలో లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
* ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి రంగమహాల్‌ చౌరస్తా వరకు ఒక స్కైవాక్‌ ప్రతిపాదించారు. దీన్ని నిర్మిస్తే మహాత్మగాంధీ బస్సు స్టేషన్‌లోకి మెట్రోస్టేషన్‌కు బయటివాళ్లు సులభంగా చేరుకునే వీలుంటుంది. కానీ ఇప్పటివరకు ఈ పనులు మొదలెట్టలేదు.
* సుల్తాన్‌బజార్‌ స్టేషన్‌ కింద పనులన్నీ గజిబిజీగా ఉన్నాయి. కొన్ని మెట్ల మార్గాల పనులు కొనసాగుతుండగా కొన్ని పూర్తయ్యాయి. వయాడక్ట్‌ కింద హాకర్ల కోసం అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. మెట్రో ప్రారంభం కాబోతున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. తవ్వకాలతో రహదారి పూర్తిగా గుంతలు పడి మట్టిరోడ్డుగా మారింది.
* నారాయణగూడ స్టేషన్‌ వద్ద పనులు అంసంపూర్తిగా ఉన్నాయి. కాచిగూడ నుంచి కోఠి మార్గంలో మెట్రో వయాడక్ట్‌ పక్కన తొలిగిపోయిన రోడ్డును బాగు చేయకపోవడంతో అక్కడ తోపుడుబండ్లకు అడ్డాగా మారి రహదారి కుంచించుకుపోయింది.
* జేబీఎస్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్ల వద్ద పాదబాటల పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కాంక్రిట్‌ వేశారు. జేబీఎస్‌ వద్ద టైల్స్‌ పనులు జరుగుతుండగా మిగతా స్టేషన్లలో చేపట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

నిర్బంధ ‘శిక్ష’ణ.. ప్రాణాలకేదీ రక్షణ?

సోమవారం వచ్చిందంటే రెండు లేదా మూడు పరీక్షలు రాయాల్సిందే..! ఇక దానికి ముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీఅవర్‌ పేరిట రుద్దుడు.. అలా అని వారంలో మిగిలిన రోజులు స్వేచ్ఛగా ఉంటుందా.. అంటే అసలే ఉండదు. రెగ్యులర్‌ సబ్జెక్టులు చదవాలి.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.. నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పంజరంలా భావిస్తున్న కళాశాలల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా.. అని భావిస్తున్నారు. ఏదో రకంగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  చేరితే చదువు తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా కనీసం బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండటం లేదు. కళాశాలలో చేరినప్పట్నుంచి ఇంటర్‌ విద్యార్థులపై చదవుల భారం వేస్తుండటంతో.. వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.