close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

కదలండి.. కన్నీళ్లు ఆపండి

రాజీవ్‌ రహదారిలో తరచూ ప్రమాదాలు
మలుపు వద్ద జాగ్రత్త చర్యలతో నివారణకు అవకాశం
హకీంపేట

అల్వాల్‌, న్యూస్‌టుడే: ఆ రహదారి మలుపు వద్ద మృత్యువు కాచుకొని కూర్చుంటుంది. ఏ సమయంలో ఎవరిని కాటు వేయాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా వాహనదారులు పరిమితికి మించి రయ్‌మని దూసుకువెళ్తారు. అంతేనా మలుపులో ఎదుటి వాహనాలను అధిగమించ(ఓవర్‌టెక్‌) వద్దని తెలిసీ కూడా మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. నగరం నుంచి గోదావరిఖని వరకు విస్తరించి ఉన్న రాజీవ్‌రహదారి మార్గంలోని హకీంపేట ప్రమాదజోన్‌లో నెలకొన్న భయానక పరిస్థితి ఇది. తాజాగా మచ్చబొల్లారంలోని ఇద్దరు మిత్రుల విషాదానికి కూడా ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సు అతివేగంగా రావడమే కారణమని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు ఇక్కడ అనేకం జరిగాయి. అయినా యంత్రాంగం ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం. మలుపు ప్రాంతాన్ని ప్రమాదజోన్‌గా ప్రకటించి 20కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేయాలని ఓ సూచిక బోర్డు పెట్టి చేతులు దులుపుకొంది. కానీ ప్రమాదాలకు పూర్తి కారణాలు తెలుసుకుని అరికట్టడంలో వైఫల్యం చెందుతోంది.

శామీర్‌పేట వాసులే ఏడుగురు మృతి
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో శామీర్‌పేట మండల పరిధికి చెందిన వారు ఏడుగురు దుర్మరణం చెందారు. అల్వాల్‌ వాసులు ఐదుగురు ఉండగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన వారు పలువురు ఉన్నారు. రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ జరిగిన ప్రమాదాలకు లెక్కే లేదు. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ద్విచక్ర వాహనాలు, కారు, ఆటోల్లో వెళ్తున్న వారు ప్రమాదాల బారిన పడ్డారు. అధిక శాతం ప్రమాదాలు వాహనాలు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడం వల్లే జరిగాయి. ఒక వైపు నుంచి వాహనం వస్తే మరోవైపు నుంచి ఇక్కడ వాహనం కనిపించదు. ఒక్కసారిగా మలుపు వద్దకు రాగానే ఎదురు వాహనం కనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో ఆయా వాహనాల వేగం పరిమితంగా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ బస్సు నుంచి మొదలు కారు వరకు 80కిలో మీట్లర వేగం దాటి ప్రయాణిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలది ఇదే వేగం. ఆటోలు సైతం 40 కిలోమీటర్లను దాటి మలుపును తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో నుంచి వాహనాలు మళ్లడం, ఎదురుగా వచ్చే వాహనంతో అయోమయం, వేగాన్ని నియంత్రించలేని స్థితి ఉండటం వల్లే ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

సీఎం ప్రయాణించే దారైనా..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరచూ ఇక్కడి మార్గంలోనే ఫాంహౌస్‌తోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల పర్యటనకు వెళ్తున్నారు. అయినా ప్రమాదజోన్‌గా గుర్తించిన మలుపు వద్ద వేగ నియంత్రణకు కచ్చితమైన నిబంధనలు అధికారులు అమలు చేయలేకపోతున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్లతోపాటు స్పీడ్‌బ్రేకర్లు(వేగనిరోధకాలు) ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్నారు. కానీ రోడ్డు నిర్వహణ బాధ్యతను చూసే ఆర్‌అండ్‌బీ కానీ ట్రాఫిక్‌ పోలీసులుగాని ఈ విషయంలో ఎందుకో స్పందించడం లేదు. ప్రమాదం జరిగినప్పుడే మాత్రమే హడావుడి చేస్తూ ప్రమాదాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రమాద జోన్‌ వైపు చూడటం లేదు. ప్రతి వాహనం వేగాన్ని నియంత్రించేలా మలుపు వద్ద ఏర్పాట్లు ఉంటేనే ప్రమాదాలను నిర్మూలించవచ్చని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

నిర్బంధ ‘శిక్ష’ణ.. ప్రాణాలకేదీ రక్షణ?

సోమవారం వచ్చిందంటే రెండు లేదా మూడు పరీక్షలు రాయాల్సిందే..! ఇక దానికి ముందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీఅవర్‌ పేరిట రుద్దుడు.. అలా అని వారంలో మిగిలిన రోజులు స్వేచ్ఛగా ఉంటుందా.. అంటే అసలే ఉండదు. రెగ్యులర్‌ సబ్జెక్టులు చదవాలి.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వాలి.. నగరంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు సాగిస్తున్న ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. పంజరంలా భావిస్తున్న కళాశాలల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా.. అని భావిస్తున్నారు. ఏదో రకంగా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో విహరిస్తూ అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో  చేరితే చదువు తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా కనీసం బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండటం లేదు. కళాశాలలో చేరినప్పట్నుంచి ఇంటర్‌ విద్యార్థులపై చదవుల భారం వేస్తుండటంతో.. వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.