close

ఆదివారం, మార్చి 29, 2020

ప్రధానాంశాలు

మార్గదర్శి, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా రేపు

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీ, మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటలవరకు మూసాపేటలోని సర్కిల్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన 19నుంచి 30ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.11,465 వేతనం ఉంటుందని తెలిపారు. టీఏ, డీఏ అదనంగా ఇస్తారన్నారు. ఆసక్తి కలిగినవారు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 80085 35309 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.