close

సోమవారం, అక్టోబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరుప్రాయం.. అద్భుత విజయం

14 ఏళ్లలో 58 పతకాలు
వరుస విజయాలతో మెరుపులు
‘2020’ బాల శక్తి పురస్కార్‌ అవార్డు
నగరానికి చెందిన మరో  ఇద్దరికీ..

న్యూస్‌టుడే, హైదరాబాద్‌: 4వ తరగతి.. అంటే పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు.. ఇంటా బయట చదువే ప్రపంచంగా గడుపుతారు.. కానీ 14 ఏళ్ల బాలిక అటు చదువులో.. ఇటూ గన్‌ షూటింగ్‌లోనూ రాణిస్తూ సంచలనాలు రేపుతోంది. నాన్న స్ఫూర్తితో సరదాగా గన్‌ చేత పట్టి సీనియర్‌లను వెనక్కి నెట్టి ముందుకు వెళ్తోంది. రాష్ట్ర, జాతీయ, ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొని క్రీడల్లో స్వర్ణ సౌరభాలతో 58 పతకాలను తన ఖాతాలో వేసుకుంది నగరానికి చెందిన ఈషా సింగ్‌. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది.

బొమ్మ తుపాకీతో..  షూటింగ్‌.. అంటే ఎంతో ఏకాగ్రత అవసరం.. గురి తప్పకుండా షాట్‌ కొట్టాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. దీని కోసం ఇంట్లోనే సాధన చేయడం మొదలు పెట్టింది. 10 మీటర్ల దూరంలో ఓ పేపర్‌ను ఏర్పాటు చేశారు. గురి తప్పకుండా బొమ్మ తుపాకీతో సాధన మొదలు పెట్టింది. అలా ఏడాది పాటు శిక్షణ తీసుకుంది. అనంతరం పుణెలోని గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీలో మరో ఏడాది శిక్షణ తీసుకుంది. శిక్షణ కోసం తండ్రితో కలిసి రాకపోకలు సాగించేది. శిక్షణ పూర్తయిన అనంతరం రాష్ట్రంలో నిర్వహించిన పోటీల్లో అండర్‌-14  సబ్‌జూనియర్‌ విభాగంలో మెరిసింది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో పట్టిందల్లా బంగారం అయింది. వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

 

నాన్న ప్రోత్సాహంతో.. ఈషా నాల్గో తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రి సచిన్‌ సింగ్‌తో ఆయన స్నేహితుడు గౌతమ్‌(గచ్చిబౌలి శాట్స్‌లో అధికారి) దగ్గరకు వెళ్లారు. అతను రైఫిల్‌ షూటర్‌. అక్కడ ఉన్న గన్‌లు ఇషా దృష్టిని ఆకర్షించాయి. ఎలా ఉంటుందో చూడాలని ప్రయత్నించింది. అక్కడ ఉన్న గన్‌ను గురి చూసేందుకు పైకి ఎత్తలేక పడిపోయింది. అప్పుడే తాను ఎలాగైనా షూటింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. నాన్న ప్రోత్సాహంతో అటు చదువులోనూ రాణిస్తూ ఇటు ఎయిర్‌ పిస్టల్‌లో తనదైన ముద్ర వేసుకుంటుంది. అతి చిన్న వయస్సులోనే షూటింగ్‌లో పసిడి పతకాలతో దూసుకుపోతున్న ఈషాపై ప్రముఖులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

నగర బాలలకు రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్‌ అవార్డు.. పాఠశాల ప్రాయంలోనే అద్భుత విజయాలను సాధించారు. చదువులో రాణిస్తూనే కోరుకున్న రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు వరించింది. విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలకు అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డును దిల్లీలో బుధవారం నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు.  క్రీడా విభాగంలో ఈషా సింగ్‌(9వ తరగతి), పర్వతారోహకుడు పోతురాజుల సమన్యూ(4వ తరగతి), ఇంద్రజాలంలో దర్శ్‌ మలని(6వ తరగతి) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వీరికి 24న ప్రధాన మంత్రితో చర్చా కార్యక్రమం ఉంటుంది. 26న దిల్లీ ఎర్రకోటలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో వీరు పాల్గొంటారు.

 

టోక్యో ఒలంపిక్స్‌లో గెలుపొందాలి: ఈషా సింగ్‌
రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్‌ అవార్డు రావడం ఆనందంగా ఉంది. అవార్డు రావడం వెనుక నాన్న కృషి ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో ఒలింపిక్‌లో అర్హత సాధించి గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.