close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

డబీర్‌పురాలో ఎంఐఎంకు సరిలేరెవ్వరు

 1225 ఓట్లతో రెండో స్థానంలో భాజపా
  మూడులో తెరాస, నాలుగులో  కాంగ్రెస్‌

మాదన్నపేట, న్యూస్‌టుడే: డబీర్‌పురా డివిజన్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లు పతంగిని ఎగరేసి ఎంఐఎంకు విజయాన్నందించారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి ఏకపక్షంగా వ్యవహరించి ఆ పార్టీకి కంచుకోటగా నిలిపారు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు సాధించగా ఈ ఉప ఎన్నికల్లోనూ ఎంఐఎం (అభ్యర్థి మీర్‌ బాసిత్‌ ఆలీ) 10465 ఓట్లు సంపాదించి పాతనగరంలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో డబీర్‌పురా (30) డివిజన్‌ అభ్యర్థిగా మీర్జా రియాజుల్‌ హసన్‌ అఫెండి (ఎంఐఎం) 10,813 సాధించి గెలవగా.. మహమ్మద్‌ జీశాన్‌ (తెరాస)4340 రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం తెరాస అభ్యర్థి రజా ఆలీ మీర్జా కేవలం 950 ఓట్లు మాత్రమే సంపాదించారు. రెండో స్థానంలో నిలిచిన భాజపా అభ్యర్థి అఖిల్‌ ఆఫండికి 1225 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి అస్గర్‌ ఆలీకి 950 ఓట్లు వచ్చాయి. 175 చెల్లని ఓట్లు కంటె తక్కువగా 147 ఓట్లు సాధించిన తెదేపా అభ్యర్థి మహమూద్‌ చివరి స్థానంలో ఉన్నారు.

అత్యంత తక్కువ శాతం పోలింగ్‌
ఈ ఉప ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 50155, అందులో 27.31శాతం ఓటర్లు అనగా 13689 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా అత్యంత తక్కువ శాతం పోలింగ్‌ జరిగింది. దీంతో 12గంటల లోపే ఫలితం వెలువడింది. లెక్కింపు ముగిసిన వెంటనే గెలిచిన అభ్యర్థి మీర్‌ బాసిత్‌ ఆలీకి రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ కుమార్‌ ధ్రువపత్రాన్ని అందచేశారు. శాసనమండలి సభ్యుడు మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఆఫండి ఇతర నాయకులు.. గెలిచిన అభ్యర్థిని సన్మానించారు. ఇది తమ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీపై ఓటర్లు ఉంచిన నమ్మకంగా పేర్కొన్నారు. గతంలో ఉన్న కార్పొరేటర్‌ మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఆఫండి శాసనమండలి సభ్యుడుగా ఎన్నిక అయినందువల్ల డబీర్‌పురా డివిజన్‌కు ఉప ఎన్నిక వచ్చింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.