close

ఆదివారం, మార్చి 29, 2020

ప్రధానాంశాలు

ఆసక్తిని రేకెత్తించిన ఫలితాలు

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: శంకర్‌పల్లి పురపాలికలో 5వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా అందరిలో ఉత్కంఠ రేగింది. ఇక్కడ 1159 ఓట్లకు 1083 ఓట్లు పోలయ్యాయి. వీటిలో తెరాస అభ్యర్థి జూలకంటి లక్ష్మమ్మకు 522 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి మణికొండ లలితకు 522 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వార్డులో 3 పోస్టల్‌ బ్యాలెట్‌లు పడగా వాటిని లెక్కించగా రెండు తెరాస, ఒకటి కాంగ్రెస్‌కు పోలయ్యాయి. మరోసారి ఓట్లు లెక్కించి 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై తెరాస అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

వరసకు అత్తా కోడళ్లు
* శంకర్‌పల్లి పురపోరులో 5వ వార్డు నుంచి పోటీ చేసిన జూలకంటి లక్ష్మమ్మ, 14వ వార్డు నుంచి పోటీ చేసిన జూలకంటి శ్వేత ఇద్దరూ వరసకు అత్తా కోడల్లు. ఇద్దరూ తెరాస నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం.

* శంకర్‌పల్లి పురపోరులో 12వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసాని వాణి, 3వ వార్డు నుంచి తెరాస నుంచి పోటీ చేసిన పార్సి రాధ వరసకు తల్లీకూతురు. ఇద్దరూ ఆయా స్థానాల నుంచి విజయం సాధించారు.

3వ వార్డులో భాజపా జోరు
శంకర్‌పల్లి పురపోరులో 10 స్థానాల్లో పోటీ చేసిన భాజపా అభ్యర్థులు ఎక్కడా తగిన పోటీ ఇవ్వలేకపోయారు. అన్ని వార్డుల్లో కలిపి 679 ఓట్లు మాత్రమే పడ్డాయి. 3వ వార్డు నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి చేవెళ్ల శిరీష 366కు వచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థులకు పడిన ఓట్లలో ఇవే అత్యధిక ఓట్లు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.