close

మంగళవారం, నవంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఏఏకు వ్యతిరేకంగా ముషాయిరా

చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: పాతనగరంలోని ఖిల్వత్‌ మైదానంలో మజ్లిస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా శనివారం రాత్రి నిర్వహించిన ముషాయిరా ఆద్యంతం సభికులను ఆకట్టుకుంది. ముషాయిరాలో ప్రముఖ కవులు మంజర్‌ భోపాలి, రహత్‌ ఇందోరి, సంపత్‌ సరల్‌, లతాహాయ, షబీనా అబీద్‌, నబియాఖాన్‌, హుస్సేన్‌ హైదరీ, హషీం ఫిరోజ్‌ బాది, అఫ్జల్‌ మంగ్లూరి తదితరులు తమ కవితలు, షాహీరీలతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నరేంద్రమోదీ పాలనపై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ షాహరీలు వినిపించారు. దేశభక్తిని పెంపొందించేలా వారి కవితలు సాగాయి. షబీనా అదీబ్‌ ఆలపించిన ‘హమారా దేశ్‌ హిందుస్తాన్‌..యేహీ జీయింగీ.. యెహీ మరీంగే’ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. సంపత్‌ సరల్‌ తన కవితలో మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ప్రధానిని విమర్శించారు. తాము ఇక్కడే పుట్టామని, పాకిస్తాన్‌ ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేస్తామని చెప్పడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు ముంతాజ్‌ఖాన్‌, అహ్మద్‌ పాషాఖాద్రీ, అహ్మద్‌ బలాల, మేరాజ్‌ హుస్సేన్‌, మోజంఖాన్‌, కౌసర్‌ మొహిద్దీన్‌, ఎమ్మెల్సీలు రియాజుల్‌ హసన్‌ అఫందీ, జాఫ్రీ, ముస్లిం మత ప్రముఖులు మౌలానా సయాదుల్‌ ఖాద్రీ, మౌలానా జాఫర్‌పాషా, మౌలానా అలీ ఖాద్రీ, సయీద్‌ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

రహదారులలో భారీ తెరలు..
సీఎఎకు వ్యతిరేకంగా మజ్లిస్‌ నిర్వహించిన ముషాయిరా సభకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖిల్వత్‌ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి. రహదారులపై తెరలు ఏర్పాటు చేసి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో జనం తెరల ముందు గుంపులుగా చేరి కార్యక్రమాన్ని తిలకించారు. జాతీయ జెండాలు పట్టుకుని యువకులు, మహిళలు భారీగా కార్యక్రమానికి తరలి వచ్చారు. కోర్టు ఆంక్షల నేపథ్యంలో 9.15 గంటలకు కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగించారు. కార్యక్రమం అనంతరం యువకులు గుంపులుగా వెళుతూ ప్రధాని మోదీకి, సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్‌ ముషాయిరా సభ సందర్భంగా ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు కమిషనర్లు డి.ఎస్‌.చౌహాన్‌, షిఖా గోయల్‌, అనిల్‌కుమార్‌, రామగుండం కమిషనర్‌ వి.సత్యనారాయణ, డీసీపీ బాబూరావు, అదనపు డీసీపీ రఫీఖ్‌ తదితరులు బందోబస్తు పర్యవేక్షించారు.

సెల్ఫీలు తీసుకున్న అసదుద్దీన్‌ ఒవైసీ..
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేదిక మీద ఉన్న కవులు, ప్రముఖులతో సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎగబడ్డారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.