close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష

దరఖాస్తులకు ఏప్రిల్‌ 4 చివరి తేదీ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ‘అర్హత పరీక్ష- 2020’కు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 4 చివరి తేదీ అని విశ్వవిద్యాలయవర్గాలు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానమైన అర్హత లేని అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరానికి మూడేళ్ల డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు 2020 జులై 1 నాటికి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. విశ్వవిద్యాలయం పోర్టల్‌ ‌్ర్ర్ర.్జ౯్చ్న్య్న-ఃi-’.i- ద్వారా విద్యార్థులు అధ్యయన/ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. అంతర్జాలంలో డెబిట్‌/క్రెడిట్‌ ద్వారా రూ. 300 ప్రవేశ రుసుం చెల్లించవచ్చని లేదా ఆన్‌లైన్‌ ఫ్రాంఛైజీ కేంద్రాలలో రూ. 310 చెల్లించి రశీదు పొందాలని ఆ ప్రకటనలో సూచించారు. ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో అర్హత పరీక్ష జరుగుతుంది. అర్హత సాధించిన విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాలలోని అధ్యయన కేంద్రాలలో ఎక్కడైనా 2020-21 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రంలో లేదా 7382929570/580/590/600 నంబర్లలో సహాయ కేంద్రాలలో సంప్రదించవచ్చని విశ్వవిద్యాలయ వర్గాలు సూచించాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.