close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

తల్లిదండ్రుల చెంత చేర్చిన సామాజిక మాధ్యమం

తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: సరిగ్గా వినియోగిస్తే సామాజిక మాధ్యమం కూడా మంచి చేస్తుందనేందుకు ఉదాహరణ ఇది. ఇంటి నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చి వారి శోకాన్ని తీర్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని ఈస్ట్‌ కాకతీయనగర్‌కు చెందిన ఓ బాలుడు(15) ఈ నెల 24న ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి చిత్రాన్ని ఇతరులకు పంపారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి ఈ సందేశం చేరింది. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి ఏఎస్‌రావునగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాలుడిని గుర్తించారు. చరవాణిలోని చిత్రంతో పోల్చుకొని అతడే అని నిర్ధరించుకొని.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని తిరిగి అందరికి పంపారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు బాలుడిని తమతో తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.