close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

ధ్యానమందిరం.. ఎంత సుందరం!

 నగర శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిర నిర్మాణం
 నేడు ప్రారంభించనున్న యోగా గురువు బాబారాందేవ్‌
 75వ వార్సికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
 హాజరుకానున్న 40వేల మంది అభ్యాసీలు

ధ్యానం.. మనసుకు ప్రశాంతతనిస్తుంది.. ధ్యానం హృదయాన్ని ఉల్లాస పరుస్తుంది.. దైవం ఎక్కడో ఉండడు.. మన ధ్యానంలోనే ఉంటాడు.. ప్రశాంత చిత్తంతో మనను ముందుకు నడిపిస్తుంటాడు.. ఇది మహనీయులు చెప్పేమాట.. నందిగామ మండలంలోని కన్హా గ్రామపంచాయతీ పరిధిలో గల శాంతివనానిది ఇదేబాట.. వేలాది మంది దేశవిదేశీయులను ధ్యానంవైపు నడిపించిన ఈ శాంతివనం మరోసారి తన ధ్యానకేంద్రం ద్వారా అందరికీ ప్రశాంతతను పంచేందుకు ముస్తాబవుతుంది.

న్యూస్‌టుడే, నందిగామ

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మందిర ఈ ఆశ్రమం 75వ వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. యోగా గురూజీ బాబారాందేవ్‌తో పాటు మిషన్‌ గురూజీ కమలేష్‌ డి పటేల్‌ (దాదాజీ)లు ప్రపంచ వ్యాప్తంగా హాజరైన 40 వేల అభ్యాసీల సమక్షంలో మందిరాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం కన్హ ఆశ్రమాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గ్లోబల్‌ హెచ్‌ క్వార్డర్‌గా ప్రకటించనున్నారు. ఇందు కోసం ఆశ్రమం నిర్వహకులు పూర్తి ఏర్పాటు చేశారు.

ఇది నేపథ్యం..
శ్రీరామచంద్ర మిషన్‌ 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్‌ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5వేలకు పైగా ధ్యాన కేంద్రాలు వెలిశాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అభ్యాసీలు లక్షల మందిలో ఉన్నారు. ఓత్తిడిని జయించేందుకు సహజమార్గ్‌ పద్దతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో అభ్యాసీలు స్వచ్చందంగా ముందుకు వస్తు అభ్యాసీల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు.

మూడు విడతలుగా..
ఆశ్రమం స్థాపించి 75 వసంతాలు పూర్తికావడంతో అశ్రమానికి వచ్చే అభ్యాసీలకు మూడు విడతలుగా వసంతోత్సవాల ఏర్పాట్లు చేశారు. ఈనెల 28 నుంచి 30, పిబ్రవరి 2 నుంచి 4, 7నుంచి 9 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందు కోసం 1.2లక్షల మంది అభ్యాసీలు వస్తున్నట్లు అంచనవేశారు. అందుకని హైదరాబాదులోని పలు డిపోల నుంచి ఆశ్రమానికి ప్రత్యేక బస్సులు, శంషాబాదు విమానాశ్రయం, రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు దేశాలలోని అభ్యాసీలు వసతి కోసం రిజీస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఇదీ ప్రత్యేకత..
ఆశ్రమంలో ఒకేసారి లక్ష మంది అభ్యాసీలు సహజమార్గ్‌ పద్ధతిలో ధ్యానం చేసేందుకు 30 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అతిపెద్ద మందిర నిర్మాణానికి 2017 డిసెంబరు 25న శంకుస్థాపన చేశారు. ఒక పెద్ద ధ్యానం కేంద్రంతో పాటు దాని చుట్టూ 8 ఉప కేంద్రాలను తాబేలు ఆకారంలో నిర్మించారు. ధ్యానం చేసే అభ్యాసీలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు మందిరం చుట్టూ పూలమొక్కలతో పాటు పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 75వ వార్సికోత్సవాలకు విచ్చేసే అభ్యాసీలకు 1400 ఎకరాల్లో 40 వేల మందికి పైగా బసచేసేందుకు వసతి ఏర్పాటు చేశారు. లక్ష మందికి వంటచేసే వంటగదులను నిర్మించారు. ఇందుకోసం ఎందరో ప్రముఖులు ఇప్పటికే ఆశ్రమానకి చేరుకుని స్వచ్ఛంధంగా పనులు చేస్తున్నారు.

ప్రముఖుల రాక..
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 7న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నహజారేతో పాటు ఎందరో ప్రముఖులు విచ్చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు రానున్నారు. ఇందు కోసం షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ పర్యవేక్షణలో సుమారు 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని గ్రామీణ వలయాధికారి రామకృష్ణ ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.