close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

అరణ్య భవన్‌లో ఎఫ్‌ఎస్‌ఓ ఆత్మహత్యాయత్నం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయమైన అరణ్య భవన్‌లో అదే శాఖకు చెందిన అటవీ సెక్షన్‌ అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సైఫాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ మొయినుద్దీన్‌ (56) అటవీశాఖలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ఎఫ్‌ఎస్‌ఓగా పనిచేస్తున్నాడు. ఆయన ధరూర్‌ రేంజ్‌లో పనిచేస్తున్నపుడు అక్కడి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో నర్సరీ, కంచె తదితర పనులు చేయించాడు. అందుకోసం రూ.8.23 లక్షలు ఖర్చు చేశాడు. ఆ మొత్తం బిల్లు ఇవ్వాలని జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయానికి ఎన్ని పర్యాయాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల జిల్లా కార్యాలయానికి వెళ్లగా గతంలో ఇచ్చేశామని, ఇంకా ఇచ్చేదేమీలేదని పేర్కొన్నారు. బుధవారం అరణ్య భవన్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వెంకటయ్యగౌడ్‌ను కలిసేందుకు మొయినుద్దీన్‌ రాగా బయటకు పంపేయండని సెక్యూరిటీ గార్డును ఆదేశించారు. బయటకు పంపించే ప్రయత్నంలో ఉండగా.. మొయినుద్దీన్‌ తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ గార్డు కంటిలోనూ కొంత పడింది. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో ఇద్దర్నీ లక్డీకాపుల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డుకు చికిత్స చేసి పంపించేశారు. మొయినుద్దీన్‌ తాగిన పురుగుల మందును తొలగించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కేసును ఎస్సై దయాకర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.