close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

లారీని ఢీకొట్టిన అంబులెన్స్‌

ఒకరికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలు

శామీర్‌పేట: మెరుగైన వైద్యం కోసం ఓ వ్యక్తిని అంబులెన్స్‌ ముందువెళ్తున్న లారీని ఢీకొట్టిన సంఘటన మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న నలుగురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుమురంభీం జిల్లా, కాగజ్‌నగర్‌ ప్రాంతం నుంచి ఓ వక్తిని నగరంలోని నిమ్స్‌ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం అద్దె అంబులెన్స్‌లో రాజీవ్‌ రహదారి మీదుగా తీసుకువెళ్తున్నారు. శామీర్‌పేట మండలం మురహరిపల్లి గ్రామ పరిధిలోని హనీబీ రిసార్ట్స్‌ వద్దకు రాగానే అంబులెన్స్‌ డ్రైవర్‌ అతివేగంగా నడిపి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టాడు. దీంతో అంబులెన్స్‌ వెనక భాగంలో కూర్చున ముగ్గురుతో పాటు డ్రైవర్‌ పక్కన ఉన్న మరో యువకుడు వాహనంలోనే ఇరుక్కుపోయారు. మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు అదే దారిలో వస్తున్న గజ్వేల్‌ జడ్పీటీసీ సభ్యుడు పంగ మల్లేశం తన వాహనాన్ని నిలిపి సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ పరారీ కావటంతో స్థానికుల సాయంతో అతి కష్టం మీద క్షతగాత్రులను బయటకు తీసి 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుమారు గంటకు పైగా సమయాన్ని కేటాయించి సహాయం చేసిన జడ్పీటీసీ సభ్యుడు మల్లేశంను స్థానికులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడినందున క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.