close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

మురుగుకు మోక్షం దొరికేనా?

నిధుల కోసం అధికారుల దిల్లీ బాట
ఎన్‌ఆర్‌సీడీ అధికారు లతో ప్రత్యేక భేటీ
మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి నిధుల కోసం జలమండలి దిల్లీ బాట పట్టింది. ఎండీ దానకిషోర్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం గురువారం జాతీయ నదుల పరిరక్షణ డైరెక్టరేట్‌ (ఎన్‌ఆర్‌సీడీ) అధికారులతో భేటీ కానున్నారు. ప్రధానంగా మూసీలో మురుగు నీరు కలవకుండా కొత్తగా ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించి నిధుల సమీకరణ ప్రధాన లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ మూసీ ప్రాంతాల్లో 29 ఎస్టీపీలు దాదాపు 1399 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. వీటికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లను కేంద్రానికి సమర్పించనున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా 65 ప్రాంతాల్లో కొత్త మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే. మూసీ పరివాహక ప్రాంతంలో కొత్తగా 65 ఎస్టీపీలతోపాటు ఇన్‌లెట్‌లు, అవుట్‌లెట్‌లు పైపు లైన్ల నిర్మాణానికి దాదాపు రూ.12 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌సీడీ కింద నిధుల సమకూర్చడానికి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైంది. తొలి విడత కొన్ని ఎస్టీపీలను నిర్మించి తర్వాత వాటిని విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కేంద్రంలోని ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.

చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయ్‌..
* ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా 2 వేల మిలియన్‌ లీటర్ల మురుగు నిత్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో 740 ఎంఎల్‌డీలు మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగతా మురుగు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా మూసీ, నగరంలోని వివిధ చెరువుల్లో కలుస్తోంది. ఫలితంగా మూసీ పూర్తిగా కలుషితం అవుతోంది. చెరువుల్లో మురుగు చేరడటంతో అవి ఉనికి కోల్పోతున్నాయి.
* రానున్న పదేళ్లలో మహానగరం జనాభా మరింత పెరగనుంది. ఇప్పటికీ శివార్లలో పాత మురుగు నీటి వ్యవస్థే దిక్కు. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సామర్థ్యం కంటే మురుగు పెరగడంతో పైపులు పగులుతున్నాయి. రహదారులపై మురుగు నీరు మడుగులు కడుతోంది.

అదనపు నిధులు ఇవ్వాల్సిందే..
జలమండలి పరిధిలోని మురుగు నీటి వ్యవస్థపై శివార్లల్లో మార్చి 1 నుంచి జలమండలి సిబ్బంది పర్యవేక్షించనున్నారు. నిధుల సమస్యతో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ నెలకు రూ.8కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినా ఇంకా నిధులు కావాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.