close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

3 కి.మీ. హద్దు.. మరవద్దు!

సీసీ కెమెరాలు పరిశీలించి వాహనదారులపై చర్యలు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా కొందరు పదేపదే వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు ట్రాఫిక్‌ కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా విశ్లేషించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. ఓ కారు ఈనెల 25న ఉదయం 9.33 గంటలకు నల్గొండ క్రాస్‌రోడ్స్‌లో బయలుదేరింది. 12.59 గంటలకు సాగర్‌ సొసైటీ కేబీఆర్‌ పార్కు వద్ద, తరువాత శ్రీనగర్‌ టీ-జంక్షన్‌ వద్ద, 1.07 గంటలకు రవీంద్రభారతి కూడలిలో సీసీ కెమెరాల కంటపడింది. దానికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేవని, అయినా ఇలా ఎందుకు తిరిగిందో గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇ-చలానా పంపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేసులతో సరిపెడుతున్నామని, సోమవారం నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ సందర్భంగా శనివారం పోలీసులు 8513 వాహనాలపై కేసులు నమోదుచేశారు. వీటిలో ద్విచక్రవాహనాలే 8093 వరకు ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.