close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

వలస కార్మికులకు సౌకర్యాలు

సమీక్ష

కీసర, ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌ జిల్లాలో వలస కార్మికులకు ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికుల సర్వేపై మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా కార్మికశాఖ అధికారులు, పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 3,600 పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో పనిచేస్తున్న 1.75 లక్షల మంది కార్మికులకు పూర్తి నెల వేతనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో డీఆర్వో మధుకర్‌రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్‌ కమిషనర్లు శ్రీనివాసరావు, వాణి, జ్యోతి, విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ అధికారి రవీందర్‌, కార్మికశాఖ అధికారి ప్రభావతి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కేంద్రంలోని వైద్య విధాన పరిషత్తు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటుచేసిన 10 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో మెరుగుపరచాలని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.