close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

సెమిస్టర్‌ పరీక్షలన్నీ వాయిదా!

విశ్వవిద్యాలయాల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యాసంస్థలన్నీ మూత పడటంతో ఏప్రిల్‌లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ హైదరాబాద్‌ నగరంలోని విశ్వవిద్యాలయాలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రకటన ఆధారంగా పరీక్షలపై స్పష్టత రానుంది.

నగరంలో అన్ని వర్సిటీల్లో ఏప్రిల్‌ 15 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. జేఎన్‌టీయూ పరిధిలో 230 కళాశాలలు, ఉస్మానియా పరిధిలో 742 కళాశాలలున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో సెమిస్టర్‌ విధానం అమల్లో ఉంది. ఇప్పటివరకు సగమే సిలబస్‌ పూర్తయింది. మార్చి 16 నుంచి విద్యా సంస్థలన్నీ బంద్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పటికి ఇంజినీరింగ్‌ పరంగా 8 వారాల పాటు తరగతులు జరగ్గా.. మరో 8 వారాలు నిర్వహించాల్సి ఉంది. డిగ్రీ కోర్సులదీ అదే పరిస్థితి. లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఇప్పటికిప్పుడు పరీక్షలు నిర్వహించే వీలుండదు. ఏప్రిల్‌ 20 నుంచి మే 6 వరకు జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన బీటెక్‌, బీఫార్మసీ సెమిస్టర్‌ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ప్రొ.కామాక్షి ప్రసాద్‌ తెలిపారు. ఉస్మానియా వర్సిటీలో ఏప్రిల్‌ 28 నుంచి జరగాల్సి ఉన్న యూజీ 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. అలానే ఓయూలో శనివారం నిర్వహించాల్సిన అకడమిక్‌ సెనేట్‌ సమావేశం వాయిదా పడిందని రిజిస్ట్రార్‌ ప్రొ.సీహెచ్‌.గోపాల్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.