close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

ఆర్టీసీ కార్గో సేవలతోనే ఉత్తమ ఫలితాలు

నిత్యావసరాల సక్రమ సరఫరా
ప్రైవేటు దోపిడీకి కళ్లెం
ఈనాడు-హైదరాబాద్‌

రైతుబజార్లు, కిరాణా దుకాణాలు ఉదయంవేళ కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీతో కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో నిత్యావసరాలను ఇళ్లకే పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  కనీసం కాలనీలకైనా పంపాల్సి ఉంటుంది. అందుకే వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ రైతుబజార్లకు తోడు ‘సంచార రైతుబజార్లు’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి బజారు నుంచి 15 వాహనాల వంతున బయలుదేరి ఇళ్ల వద్దకే కూరగాయలను తీసుకెళ్తాయి. అయితే వాహనాల కొరత తీవ్రంగా ఉంది. డీసీఎంలు కొన్నిచోట్ల అందుబాటులో లేకపోవడంతో చిన్న ట్రాలీల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి! అందుకే ఆర్టీసీ ఇటీవల సిద్ధం చేసిన కార్గో వ్యవస్థను వినియోగించుకుంటే ఫలితాలు బాగుంటాయి.గ్రామాల్లో పండిన కూరగాయలను నగరానికి తీసుకురావడం చాలా కష్టంగా మారుతోంది. ప్రైవేటు వాహనాలను సరిహద్దుల్లో వదలడం లేదు. వీటిద్వారా బయటి ప్రాంతాల వారు నగరానికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటేనే ఎంతో ఉత్తమమని రవాణారంగ నిపుణులంటున్నారు. డ్రైవర్లకు కొరత లేదు. సిబ్బందికి ఇబ్బంది ఉండదు. వాహనాలకు సమస్య తలెత్తదు. ఇప్పటికే దాదాపు 200 కార్గో వాహనాలను సిద్ధం చేశారు. గ్రామాల నుంచి నేరుగా కూరగాయలను తీసుకువచ్చి కాలనీల్లో అమ్మకానికి పెడితే నగర ప్రజలకు ఎంతో ఊరటగా ఉంటుంది.

అక్రమాలకు అడ్డుకట్ట
సరకులను ప్రస్తుత స్థితిగతుల్లో నివాస ప్రాంతాలకు నేరుగా అందించడానికి ఆర్టీసీ కార్గో వాహనాలు అనువుగా ఉంటాయి. నగరంలో ఉపాధి కోరే యువతను వినియోగించుకొని శుభ్రంగా ప్యాక్‌ చేయించి కిలో, రెండు కిలోలు, మూడు కిలోల మాదిరి సరఫరా చేస్తే ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న అనేక వెసులుబాట్లతో కొందరు ప్రైవేటు వ్యాపారులు లాభాలు పొందుతున్నారు తప్ప.. కష్టకాలంలో ప్రజలకు కాస్త సేవ చేద్దామనే ఊసేలేనప్పుడు దీంతో చెక్‌ పెట్టినట్లు అవుతుంది.  ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ఇటు ఆర్టీసీకి కూడా ఆర్థిక వెసులుబాటుగా ఉంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.