close

శుక్రవారం, మే 29, 2020

ప్రధానాంశాలు

మేమున్నాం.. మీకు అండగా!

కరోనా ప్రభావం.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రస్తుతం ఇళ్ల నుంచి కదల్లేని పరిస్థితి. ఈ తరుణంలో సరకులు స్థానికంగా లభ్యంకాకపోయినా, అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. ‘ఈనాడు’ మీకు అండగా నిలవనుంది. మీ సమస్యను మాకు తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.
* పాలు, వైద్య సాయం, కూరగాయలు, ఔషధాలు, తాగు నీరు ఇలా నిత్యావసరాలు ఏవైనా మీ ప్రాంతంలో అందుబాటులో లేకపోయినా, గంటల తరబడి విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నా మా దృష్టికి తీసుకురండి.
* మీరు చేయాల్సిందల్లా సమస్య, ప్రాంత వివరాలు కింది ఫోన్‌ నంబరుకు తెలియజేయడమే.


మీరు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 80080 55788
సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 


‘మేమున్నాం.. మీకు అండగా!’ అంటూ ‘ఈనాడు’ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చింది. అందులో వ్యక్తిగత సమస్యలు మినహాయించి ఎక్కువ మంది సందేహాలు తీర్చేలా ఉన్నవి మీ ముందుకు తెస్తున్నాం.

ఈనాడు, హైదరాబాద్‌; బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి

ప్రశ్న: రేషన్‌ కార్డుకు ఇప్పుడు బ్యాంకు ఖాతాను లింక్‌ చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.?

- పురుషోత్తం, ఎన్జీవోస్‌ కాలనీ

సమాధానం: దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు వస్తాయి.
ప్రశ్న: వరంగల్‌లో నాకు రేషన్‌ కార్డుంది. దానిపై నగరంలో రేషన్‌ బియ్యం ఇవ్వడం లేదు.

- రమేష్‌, నిజాంపేట్‌

సమాధానం: మీకుంది ఆహార భద్రతా కార్డయితే ‘రేషన్‌ పోర్టబులిటీ’ కింద రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ ఇస్తారు.
సమాధానాలు ఇచ్చింది: హైదరాబాద్‌ సీఆర్వో కార్యాలయం
సమస్య: బంజారాహిల్స్‌ సాయి ఎన్‌క్లేవ్‌ ప్రాంతానికి మంచినీరు సరఫరా కావడం లేదు.

- బాబూరావు, బంజారాహిల్స్‌ రోడ్డు నం.12,

జవాబు: పైపులైను మరమ్మతులు ఆలస్యమవుతున్నాయి. అందుకే ఆ ప్రాంతానికి నిత్యం ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నాం.

- విష్ణువర్ధన్‌, జలమండలి మేనేజర్‌, తట్టిఖానా

ప్రశ్న: ఓల్డ్‌బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

-కోటేశ్వరరావు, అంజయ్యనగర్‌

సమాధానం: పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- వి.మమత, జడ్సీ, కూకట్‌పల్లి జోన్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.