close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

మేమున్నాం.. మీకు తోడుగా

‘కరోనా’ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగించి కొన్ని ఆంక్షలను సడలించినప్పటికీ... ఇంకా మీకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ‘ఈనాడు’ తోడుగా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన ‘కరోనా’ సహాయం... వైద్య సహాయం అందటంలో జాప్యం నెలకొన్నా... బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా స్పందించవచ్చు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు అనంతరం స్వస్థలాలకు వచ్చిన కార్మికులకు ఉపాధి కల్పనలో... ప్రజల దైనందిన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలనూ దిగువ పేర్కొన్న నంబరుకు ఫోన్‌ చేసి చెప్పొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషి చేస్తాం.
మీరు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 80080 55788
సమయం : ఉ।। 10 గం।। నుంచి మ।। ఒంటి గంట మధ్య
* స్పందనకు  వందనం
కర్మన్‌ఘాట్‌: రాజస్థాన్‌, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు హస్తినాపురం డివిజన్‌ టీకేఆర్‌ రోడ్డు బలహీన వర్గాల ప్రాంతమైన నందనవనంలో జీవిస్తున్నారు. పనుల్లేక తిండికి ఇబ్బందులు పడుతున్నారు. ‘మేమున్నాం.. మీకు తోడుగా’ ద్వారా ‘ఈనాడు’ను సంప్రదించారు. షార్డ్‌ స్వచ్ఛంద సంస్థ, రాజీవ్‌శెట్టినగర్‌ ప్రతినిధులు నరసింహగౌడ్‌, ఇబ్రహీం స్పందించి కార్మికులకు శుక్రవారం నిత్యావసరాలు అందజేశారు.
? కర్మన్‌ఘాట్‌: హస్తినాపురం డివిజన్‌ శ్రీరమణ కాలనీ ఫేజ్‌-2లో గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నాం.
- వెంకటయ్య, శ్రీరమణ కాలనీ.
కరోనా తగ్గుముఖం పట్టగానే మరమ్మతులు చేపడతాం.
- ఇందిరాబాయి, ఈఈ.
? మల్కాజిగిరి: నేరేడ్‌మెట్‌ కృపా కాంప్లెక్స్‌ వద్ద పాదబాట కోసం తవ్వారు. గుంతలు ఏర్పడి మురుగు నిలుస్తోంది. - మూర్తి.
పాదబాట పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. - దశరథ్‌, ఉపకమిషనర్‌, మల్కాజిగిరి సర్కిల్‌.
? మల్లాపూర్‌: మల్లాపూర్‌ డివిజన్‌ అశోక్‌నగర్‌లో నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. - సుకుమార్‌, అశోక్‌నగర్‌.
సమస్యను పరిశీలించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. - వేణుగోపాల్‌, జలమండలి మేనేజర్‌.

? ఆల్విన్‌ కాలనీ: ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ వెంకటపాపయ్యనగర్‌ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తి చేసి ప్యాచ్‌ వర్క్‌ చేయకుండా వదిలేశారు. -శ్రీకాంత్‌, వెంకçపాపయ్యనగర్‌ ఆల్విన్‌కాలనీ.
* రోడ్డు చివర కొంత భాగం కోర్టు లో వివాదంలో ఉంది. తీర్పు అనంతరం ప్యాచ్‌వర్క్‌ పూర్తి చేస్తాం. - సుభాష్‌, ఏఈ, కూకట్‌పల్లి ఇంజినీరింగ్‌ విభాగం.

? ఎల్బీనగర్‌:  మన్సూరాబాద్‌ డివిజన్‌ శ్రీసరస్వతీనగర్‌ కాలనీకి తాగునీరు తక్కువగా వస్తోంది.
- రాము, శ్రీసరస్వతీనగర్‌.
* సిబ్బందిని పంపించి, సమస్యను పరిష్కరిస్తాం.- శ్రీనివాసరెడ్డి, డీజీఎం, జలమండలి.
? కర్మన్‌ఘాట్‌, సికింద్రాబాద్‌: చంపాపేట డివిజన్‌ సాగర్‌ రోడ్డు న్యూపద్మానగర్‌ కాలనీలో, సీతాఫల్‌మండి డివిజన్‌ మైలార్‌గడ్డలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది.  గుంపులుగా ఉంటూ దాడి చేస్తున్నాయి.
- రాఘవేందర్‌, న్యూ పద్మానగర్‌; రషీద్‌, మైలార్‌గడ్డ.
* పరిశీలించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడతాం. - సబితారెడ్డి, వెటర్నరీ అధికారి; రవికుమార్‌, డీసీ, సికింద్రాబాద్‌ సర్కిల్‌
? శామీర్‌పేట: గ్రామ నక్షా కారణం చూపుతూ మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌  రైతులకు రైతుబంధు సాయం ఇవ్వడంలేదు. - నందగిరి ఉపేందర్‌శర్మ
* సమాధానం: ఆ గ్రామానికి నక్షా లేనందున సర్వే చేశాం.  ఆన్‌లైన్‌లో రైతుల పేర్లు నమోదు చేస్తున్నాం. అర్హులందరికీ సాయం అందేలా జాబితా పంపిస్తాం.

- ఆర్‌.గోవర్ధన్‌, తహసీల్దార్‌.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.