close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

‘గాంధీ’లో పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన

రూ. 50లక్షల బీమా కల్పించాలని డిమాండ్‌

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పొరుగుసేవల పారిశుద్ధ్య సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రాణాలను పణంగాపెట్టి కరోనా విధులను నిర్వహిస్తున్న తమకు కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, కరోనా సోకితే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో పనిచేస్తున్న 200 మంది సిబ్బంది శుక్రవారం విధులకు హాజరయ్యేముందు గంటసేపు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపరింటెండెంట్‌ ఎం.రాజారావుకు అందజేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.