close

శుక్రవారం, జూన్ 05, 2020

ప్రధానాంశాలు

భాగ్యనగరం.. బస్తీ వైద్యం

ఒకేరోజు 45 కేంద్రాల ప్రారంభోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: నగరవ్యాప్తంగా శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు వారి పరిధిలోని బస్తీదవాఖానాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్లు, జిల్లా రెవెన్యూ విభాగం, వైద్యారోగ్యశాఖ అధికారులు ఒకేసారి 45 బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయడంతో ఆయా బస్తీల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ వెంగళరావునగర్‌, ఎర్రగడ్డ డివిజన్లలో రెండు కేంద్రాలను ప్రారంభించగా, ఇతర ప్రజాప్రతినిధులు వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌లోని విక్టోరియా రాణిగంజ్‌, కలాసిగూడ జనరల్‌బజార్‌, గన్‌ఫౌండ్రీలోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌ కేంద్రాలను పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, లక్ష్మిగూడలోని తెలంగాణ ఎన్జీవో కాలనీ, డాక్టర్‌.జకీర్‌హుస్సేన్‌కాలనీ, బార్కస్‌లోని మలాత్‌నగర్‌ కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ, పటాన్‌చెరులోని చైతన్యనగర్‌ కాలనీ, కానుకుంట ప్రభుత్వ పాఠశాల, ఆర్‌సీపురం కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు, గోషామహల్‌లోని కామాటిపుర కమ్యూనిటీహాల్‌ దవాఖానాను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రభాకర్‌, కవాడిగూడలోని రోస్‌కాలనీ, గోషామహల్‌ దత్తాత్రేయనగర్‌, గుడిమల్కాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ముషీరాబాద్‌ డి.ఎస్‌.నగర్‌ కమ్యూనిటీహాల్‌, తార్నాక విజయపురికాలనీ కేంద్రాన్ని ఉపసభాపతి పద్మారావుగౌడ్‌, జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వరనగర్‌, కాప్రా సింగంచెరువు, కాప్రా వివేకానందనగర్‌ కేంద్రాలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, చర్లపల్లిలోని కుషాయిగూడ మహిళా మండలి భవన్‌, కాప్రా అశోక్‌నగర్‌, కుషాయిగూడ కమలానగర్‌ కేంద్రాలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి, కుషాయిగూడ శ్రీరామ్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితరాణా, బుద్వేల్‌ కమ్యూనిటీహాల్‌, లింగోజిగూడ కామేశ్వర్‌రావు కాలనీ కేంద్రాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.