close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 నెలలు.. 38 పాదచారి వంతెనలు

కీలక కూడళ్ల వద్ద రోడ్డు దాటేలా ఏర్పాట్లు

రూ. 100 కోట్లతో నిర్మాణ పనులు

ఈనాడు, హైదరాబాద్‌

కొత్తగా నిర్మించే ఎఫ్‌ఓబీల ఆకృతి

భాగ్యనగరంలోని అనేక ప్రధాన మార్గాల వద్ద పాదచారులు పడుతున్న అవస్థలు త్వరలో తీరనున్నాయి. వీరు ఇకపై సులువుగా, సురక్షితంగా రోడ్డు దాటొచ్ఛు మూడు నెలల్లో 38 పాదచారి పైవంతెనలు అందుబాటులోకి రాబోతున్నాయి. సుమారు రూ.100కోట్లతో ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎఫ్‌ఓబీలకు భిన్నంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం వీటి ఆకృతులను సిద్ధం చేసింది.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పరిధిలో 9వేల కిలోమీటర్ల రోడ్లున్నాయి. అందులో 2వేల కి.మీ రోడ్లు ప్రధానమైనవి. లక్షలాది వాహనాలు వాటిపై రాకపోకలు సాగిస్తుంటాయి. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రద్దీ కూడళ్లు, బస్టాపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. రోడ్డు దాటే సమయంలో పాదచారులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఓబీల నిర్మాణ ప్రాజెక్టును బల్దియా పట్టాలెక్కించింది. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు అక్టోబర్‌ నాటికి పూర్తిచేస్తామని జీహెచ్‌ఎంసీ ముఖ్య ఇంజినీరు జియాఉద్దీన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

జోన్లవారీ నిర్మితమయ్యే ఎఫ్‌ఓబీలు ఇలా..

* ఎల్బీనగర్‌ జోన్‌: ఎస్కలేటర్లతో నాగారంలోని చక్రిపురం క్రాస్‌రోడ్డు, మల్లాపూర్‌ నోమా ఫంక్షన్‌హాల్‌, వనస్థలిపురం సుష్మా థియేటర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాపు, కొత్తపేట పండ్ల మార్కెట్‌, సరూర్‌నగర్‌ స్టేడియం, హయత్‌నగర్‌ వర్డ్‌ అండ్‌ డీడ్‌ హైస్కూల్‌ వద్ద నిర్మాణాలు చేపడతారు.. ఎస్కలేటర్లు లేకుండా రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌, ఏఎస్‌రావునగర్‌ సాయి సుధీర్‌ కళాశాల బస్టాపు, హబ్సిగూడ ఎస్‌బీఐ వద్ద నిర్మిస్తారు.

* చార్మినార్‌ జోన్‌: ఎస్కలేటర్లతో బండ్లగూడ సన్‌సిటీ, ఎంజీబీఎస్‌-సీబీఎస్‌, హెరిటేజ్‌ పార్లర్‌ ఎదురుగా దుర్గానగర్‌ టీ జంక్షన్‌, ఉందానగర్‌ పాత కర్నూలు రహదారి టీ జంక్షన్‌, ఎస్కలేటర్లు లేకుండా రాజేంద్రనగర్‌ స్వప్న థియేటర్‌, గణేశ్‌నగర్‌ షా థియేటర్‌, శాలిమర్‌ హోటల్‌ వద్ద

* ఖైరతాబాద్‌ జోన్‌: లంగర్‌హౌజ్‌ అరెమైసమ్మ దేవాలయం, బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1 జీవీకే మాల్‌, పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ వద్ద ఎస్కలేటర్లతోను..ఇవి లేకుండా షేక్‌పేట పాస్‌పోర్టు కార్యాలయం వద్ద చేపడతారు.

* సికింద్రాబాద్‌ జోన్‌: గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల వద్ద ఎస్కలేటర్లతోను.. ఇవి లేకుండా హిమాయత్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు-నారాయణగూడ పైవంతెన వరకు ఉన్న రోడ్డు మార్గం, నేరెడ్‌మెట్‌ బస్టాప్‌, తార్నాక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల వద్ధ.

* కూకట్‌పల్లి జోన్‌: షాపూర్‌నగర్‌ రంగభుజం థియేటర్‌ వద్ద ఎస్కలేటర్‌తో.. బాలానగర్‌ ఎన్‌ఎస్‌కేకే పాఠశాల వద్ద అది లేకుండా నిర్మాణం చేపడతారు.

* శేరిలింగంపల్లి జోన్‌: ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆసుపత్రి, హైటెక్‌సిటీ సైబర్‌గేట్‌ వే, గచ్చిబౌలి టెలికాంనగర్‌, మదీనాగూడ చెన్నై షాపింగ్‌మాల్‌ వద్ద, చందానగర్‌ విజేత సూపర్‌మార్కెట్‌, ఆల్విన్‌కాలనీ ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్కలేటర్లతో నిర్మిస్తారు. ఆదర్శ్‌నగర్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌, గచ్చిబౌలి ఐడీబీఐ బ్యాంకు, మియాపూర్‌ భాను టౌన్‌షిప్‌, గచ్చిబౌలి ఇందిరానగర్‌లో ఎస్కలేటర్లు లేకుండా నిర్మిస్తారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.