close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
కరపత్రం ఆవిష్కరించిన సంజయ్‌ తదితరులు

కాచిగూడ: బాలికా విద్యను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.280 కోట్లతో బేటీ బచావో- బేటీ పడావో పథకాన్ని అమలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ పథకానికి పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ గీతామూర్తి, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ వేదిక అధ్యక్షుడు తోట శ్రీకాంత్‌కుమార్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాచిగూడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజనులకు కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల కర పత్రాలను మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, మాధవీలత తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.