close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.28 కోట్లతో కల్లాల నిర్మాణాలు

ఉపాధి హామీ నుంచి నిధులు

ఇప్పటి వరకు 1765 మంది రైతుల ఆసక్తి

మొత్తం మీద 2830 మందికి లబ్ధి

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

మొరంగ్‌పల్లిలో రోడ్డుపై నూర్పిడి చేస్తున్న రైతులు (పాత చిత్రం)

జిల్లాలో కల్లాలు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు పంట నూర్పిడి కోసం రహదారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడంతోపాటు కొన్నిసార్లు జరిగే ప్రమాదాల వల్ల రైతుల ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ కష్టాల నుంచి అన్నదాతలను గట్టెక్కించడానికి పొలంలోనే పంట నూర్పిడిన కోసం సిమెంటు దిమ్మె (కల్లాం) ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉపాధి హామీ నిధుల నుంచి వీటి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి ఇందుకోసం జిల్లాకు రూ.28 కోట్లు కేటాయించారు. తద్వారా దాదాపు 2830 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల నుంచి డిమాండ్‌ పెరిగితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు...

ప్రతిపాదనల సేకరణ

జిల్లాలో 18 మండలాల పరిధిలో 1.92 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో పత్తి వంటి కొన్ని పంటలకు నూర్పిడి చేయాల్సిన అవసరం లేదు. పప్పు ధాన్యాలు, వరి, ఇతర పంటలకు కల్లాం తప్పనిసరిగా అవసరం. రైతులకు మూడు రకాల నమూనాలతో కల్లాం నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నుంచి నిధులు సమకూర్చనున్నారు. అదే సమయంలో రైతుకు 6 నుంచి 10 దినాలు కల్పిస్తారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఆసక్తి చూపించిన 1,765 మంది రైతుల వివరాలను వ్యవసాయ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థకు అప్పగించింది. వాటిని పరిశీలించిన మీదట నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. వారం రోజుల్లో మరో 1500 మందికి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఆసక్తి ఉన్న రైతుల నుంచి ప్రతిపాదనలను తీసుకుంటున్నారు. గతంలో ఇలాంటి పథకమే ఒకటి వచ్చినా రైతులు అంతగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు నగదు ప్రోత్సాహకం పెరిగింది. దీంతో రైతులు నిర్మాణాలకు ముందుకొస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

జాబ్‌ కార్డు ఉండాలి

దరఖాస్తు చేయాలనుకునే వ్యక్తికి జిల్లాలో మహత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు గరిష్ఠంగా పది ఎకరాలు, ఇతర రైతులు గరిష్ఠంగా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. అంతకు మించి ఉన్న రైతులు అనర్హులు.

ఆసక్తి ఉన్న వారికి అవకాశం: కృష్ణన్‌, డీఆర్‌డీఓ

ఆసక్తి ఉన్న రైతుల నుంచి కల్లాం దిమ్మ్మె నిర్మాణానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు 1765 మందికి నిర్మాణ అనుమతులు ఇచ్చాం. వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ప్రతిపాదిస్తుంది. పరిశీలించి అర్హులైన వారి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.