close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నడక దారి.. ఆదమరిస్తే అంతేమరి!

శిథిలమవుతున్న వంతెన

న్యూస్‌టుడే, పరిగి


మరమ్మతులకు నోచుకోని నడకదారి ఇదే

లఖ్నాపూర్‌ రిజర్వాయర్‌ జలకళను సంతరించుకోవడంతో పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లోని ఎనిమిది గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టు 2647 ఎకరాలు. దీని లోతు 20 అడుగులు ఉండగా ప్రస్తుతం 18 అడుగుల నీటితో తొణికిసలాడుతోంది. నాలుగేళ్ల తరువాత నిండుకుండలా మారడంతో సందర్శకులు వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై నిర్మించిన నడకదారి (ఇనుప రెయిలింగ్‌) ప్రస్తుతం శిథిలమవుతోంది. 75మీటర్ల పొడవున్న రెయిలింగ్‌ను ఐదున్నర దశాబ్దాల క్రితం నిర్మించారు. కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇనుప బోల్టులు ఊడిపోయాయి. దీనిపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదాల బారిన పడిపోతామని వాపోతున్నారు. ఇరువైపులా ఉన్న ఇనుప మెట్లు ఊగిసలాడుతున్నాయి. అంతేకాకుండా రిజర్వాయర్‌ అలుగు పారితే లఖ్నాపూర్‌తో పాటు ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ప్రజల ఇబ్బందులను దృష్ట్యా అధికారులు నడకదారిని ఏర్పాటు చేశారు. నిర్వహణ కొరవడి కాల క్రమేణా దెబ్బతింటోంది. తాత్కాలికంగా దెబ్బతిన్న ప్రదేశంలో తక్షణ మరమ్మతులు చేపట్టాలని శాశ్వత పరిష్కారం కోసం పిల్లర్లు వేసి సమస్యను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.


తుప్పు పట్టిన ఇనుపమెట్లు

సందర్శకులు వస్తున్నారు..

- చల్లా ప్రభాకర్‌రెడ్డి, రైతు, లఖ్నాపూర్‌

సుమారు 55ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి రిజర్వాయరు అభివృద్ధికి సంబంధించిన ప్రధాన పనులు జరగలేదు. గతేడాది మిషన్‌ కాకతీయ రెండో విడతలో భాగంగా నిధులు మంజూరు కావడం, మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివిధ రకాల పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. దెబ్బతిన్న నడకదారిని బాగుచేస్తే మేలు.

మరమ్మతులకు ప్రతిపాదనలు..

- కేవీ క్రిష్ణారెడ్డి, డీఈఈ, నీటిపారుదల శాఖ

నడకదారి ప్రమాదకరంగా మారిందన్న విషయం ఇటీవలే మా దృష్టికి వచ్చింది. మరమ్మతు పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. పిల్లర్ల వేస్తే శాశ్వత సమస్యకు పరిష్కారం కానుంది. ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.