close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధి పనులు సజావుగా సాగేలా చూడాలి

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: ఉపాధి పనులు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని శిక్షకులు అంజిరెడ్డి, విఠల్‌రావు అన్నారు. బుధవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఉపాధి పథకంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఎప్పటికప్పుడు మేట్లతో సమీక్ష నిర్వహించాలని, నిత్యం పర్యవేక్షించాలని అవగాహన కల్పించారు. కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. కార్యదర్శు ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో సతమతమవుతున్నామని, ఆదనంగా ఉపాధి బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు.కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజారెడ్డి పర్యవేక్షణాధికారి శాంత వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.