close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డేటా ఎనలిటిక్స్‌లో అపార అవకాశాలు

మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ రాజీవ్‌కుమార్‌

ఐఎస్‌బీ సీబీఏ విద్యార్థుల ఇ-గ్రాడ్యుయేషన్‌డే

రాయదుర్గం, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో డేటా సృష్టించే మేధస్సు ద్వారా అవకాశాలు మరింత మెరుగవుతాయని ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ, కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)లో సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌(సీబీఏ) కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల ఇ-గ్రాడ్యుయేషన్‌ డే శనివారం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అందజేశారు. రాజీవ్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని(ఆన్‌లైన్‌) మాట్లాడారు. ప్రతి పరిశ్రమ డిజిటల్‌ దిశగా పరివర్తన చెందుతూ ముందుకు సాగుతుందని, ఈ తరుణంలో డేటా, బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో నేర్పు అవసరమన్నారు. ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ కొత్త, ఆసక్తికరమైన మార్గాల్లో పనులు చేయడంలో ప్రతిఒక్కరూ సన్నద్ధం కావాలని సూచించారు. ఐఎస్‌బీ అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ మనీష్‌ గంగ్వార్‌ ప్రసంగిస్తూ.. మహమ్మారి అనంతర కాలంలో వ్యాపార విశ్లేషణ, డేటా సైన్స్‌లో నైపుణ్యమున్న వారికి డిమాండ్‌ ఉంటుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్లోక్‌ మిట్టల్‌ బంగారు పతకాన్ని, అన్మోల్‌ రజత పతకాన్ని సాధించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.