close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాగ్రత్తలతోనే కరోనా కట్టడి

పూడూరు: కొవిడ్‌-19 నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని వైద్యాధికారి సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు శనివారం పలు గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పించారు. అవసరం ఉంటేనే ఇంటినుంచి బయటకు వెళ్లాలని సూచించారు. హోటళ్లు, ఆలయాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని వివరించారు.

మోమిన్‌పేట: జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చని సర్పంచి రాజశేఖర్‌ గ్రామస్థులకు సూచించారు. మల్లారెడ్డిగూడం గ్రామంలో ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసరమైతేనే బయటకు రావాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.

దోమ: వలస కార్మికులకు తమ సంస్థ అండగా ఉంటుందని జన్‌ సాహస్‌ సంస్థ బోర్డు డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ అన్నారు. సంజీవనగర్‌లో నిత్యావసర సరకులు అందించారు. కార్యక్రమంలో సర్పంచి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.