close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వీధులు అపరిశుభ్రం.. మురుగుతో సహవాసం!

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


ఇళ్ల పక్కన నిలిచిన మురుగు

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’కి శ్రీకారం చుట్టింది. రోజువారీ స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి పల్లెలను పారిశుద్ధ్యపరంగా మెరుగు పరిచేందుకు నడుంబిగించింది. అందుకు అనుగుణంగా రూ.లక్షల్లో పద్నాలుగవ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను సైతం నెలనెలా సమకూర్చుతోంది. అయినప్పటికీ కొన్నిచోట్ల సమస్యలు తీరడం లేదు. నివాసాల మధ్య మురుగు, అపరిశుభ్రత దర్శనమిస్తోంది. తాండూరు మండలం చెంగెష్‌పూర్‌ బోనమ్మ కాలనీలో మురుగు కాల్వలు నిర్మించలేదు. దీంతో మురుగు ఇళ్ల మధ్య నిలిచిపోతుందని, పునాది గోడలు మురుగులో మునిగిపోయి దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.. రాత్రివేళ దోమలతో జాగారం చేస్తున్నామని తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే మురుగు కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.


మురుగుకాలువపై కూలిన కప్పు

సొంత డబ్బులతో మరమ్మతులు..

-నాగరాజుగౌడ్‌, చెంగెష్‌పూర్‌

మురుగు నీరు పారేందుకు కాల్వలు నిర్మించాలని పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. మురుగు నిలుస్తుండటంతో ఇళ్ల పునాదులు దెబ్బతింటున్నాయి. ఇటీవలే పునాది గోడలకు మరమ్మతులు చేయించాం. ఇదే పరిస్థితి ఉంటే మున్ముందు ఇల్లు కూలిపోయే ఆస్కారముంది. కాల్వలు నిర్మించి సమస్య తీర్చాలి.

కాల్వలు నిర్మిస్తాం..

-విశ్వనాథ్‌, పంచాయతీ కార్యదర్శి

రెండుచోట్ల కాల్వలు, కల్వర్టు నిర్మించాల్సి ఉంది. రూ.5లక్షలు అవసరమవుతాయని గుర్తించాం. నిధులు సమకూర్చుకొని త్వరలో నిర్మాణాలు చేపడతాం. అప్పటివరకు తాత్కాలికంగా మురుగు పారేందుకు యంత్రాలతో కాల్వను పునరుద్ధరింపజేస్తాం.

పత్తి పంట పాడైంది..

-కుర్వగోవిందు, రైతు, చెంగెష్‌పూర్‌

రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం. పొలం పక్కనున్న ఇళ్ల నుంచి వచ్చే మురుగు నిలిచి పంట దెబ్బతింది. పెట్టుబడి నష్టపోయే పరిస్థితి నెలకొంది. కాల్వ నిర్మించి మురుగు పొలంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.